Monday, May 13, 2024
- Advertisement -

చంద్రబాబుపై విమర్శలు, సెటైర్ల వర్షం కురిపించిన కెసీఆర్

- Advertisement -

అత్యంత అనుభవజ్ఙుడిని, ప్రపంచానికి పాఠాలు చెప్పాను అని చెప్పుకుంటూ ఉంటాడు చంద్రబాబు. ఆ విషయం తెలియదు కానీ అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు ఏమైనా చేస్తాడన్నది నిజం. కూతురిని ఇచ్చి పెళ్ళి చేయడంతో పాటు…….తననే ఓడిస్తానని ప్రగల్భాలు పలికి……..తన పార్టీ అభ్యర్థి చేతిలోనే ఘోరంగా ఓడిపోయినప్పటికీ…..తన దగ్గరకు వచ్చి సాగిలపడిన చంద్రబాబును చేరదీసి మంత్రిని కూడా చేసిన ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు. అధికారం కోసం బాబు ఏమైనా చేయగలడన్న విషయం ఆనాడే రాజకీయ మేధావులకు అర్థమైంది. ఇక 2014లో అబద్ధపు హామీలతో ఎపిలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు…….ఆ వెంటనే తెలంగాణాలో ప్రభుత్వాన్ని కూల్చి టిడిపి అధికారంలోకి వచ్చేలా చేయాలని ప్లాన్ చేశాడు. అయితే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా బాబు వ్యూహాన్ని పసిగట్టిన కెసీఆర్…..ఓటుకు నోటు కేసులో బాబును అడ్డంగా బుక్ చేశాడు. ఆ కేసు నుంచి బయటపడడం కోసమే మోడీ దగ్గర హోదాతో సహా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను బాబు తాకట్టుపెట్టాడన్న విషయాన్ని సాక్ష్యాలతో సహా రాజకీయ మేధావులు నిరూపించారు. ఇక హైదరాబాద్‌ని విడిచి పెట్టాలని కెసీఆర్ షరతు పెట్టాడు. ఇక ఆ తర్వాత నుంచీ కెసీఆర్ దగ్గర బాబు ఎలా సరెండర్ అయ్యాడో జనాలందరికీ అర్థమవుతూనే ఉంది. అయితే కెసీఆర్ అండ్ కో మాత్రం టైం వచ్చినప్పుడల్లా బాబుపైన సెటైర్స్, విమర్శలు చేస్తూనే ఉన్నారు. తాజాగా జాతీయ మీడియాతో చర్చా కార్యక్రమంలో పాల్గొన్న కెసీఆర్ మరోసారి బాబుపై పరోక్షంగా సెటైర్స్ వేశాడు.

………సింగపూర్, చైనా, మలేషియాలాంటి దేశాలతో మేం పోల్చుకోం…..తెలంగాణాకు అస్థిత్వం ఉంది
……….ఆంధ్రప్రదేశ్ పాలకులు రాష్ట్ర విభజనపై విమర్శలు చేయడం మానుకోవాలి. తెలంగాణాకు ఆంధ్రప్రదేశ్ పోటీనే కాదు.
…………కుల రాజకీయాలు ప్రోత్సహించట్లేదు. హైదరాబాద్‌ విశ్వనగరం. అన్ని కులాలు, మతాల ప్రజలు కలిసిపోయి ఉంటారు.
………నా కుటుంబ సభ్యులను నేను నామినేట్ చేయలేదు…..వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసి ప్రజా మద్దతు పొందారు. ఆ తర్వాత పదవులు దక్కాయి.

ఇలా సాగాయి కెసీఆర్ మాటలు. రాజకీయాలను అనుసరిస్తున్న వాళ్ళందరికీ కూడా కెసీఆర్ మాటల్లోని అంతరార్థం సులభంగానే అర్థమయిపోయింది. కసెీఆర్‌తో సాన్నిహిత్యం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తాకట్టుపెట్టి మరీ కెసీఆర్‌ దగ్గర సాగిలపడుతున్న పచ్చ మీడియా, పచ్చ బ్యాచ్ అధినేతకు కెసీఆర్ అండ్ కో మాత్రం పరోక్షంగా షాకులు ఇస్తూనే ఉన్నారు. కెసీఆర్ విమర్శలు, సెటైర్లకు పచ్చ బ్యాచ్ అస్సలు స్పందించదు అన్నది కూడా నిజం. అక్కడే కెసీఆర్ ఆధిపత్యం కూడా చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అంతా కూడా తెలంగాణాలో ఉన్న ప్రభుత్వాన్ని కూలదోసి ….అక్కడ అధికారంలోకి రావాలని తాపత్రయపడి చేసిన కుట్ర ఫలితం మరి. ఎన్టీఆర్ అంటే భోళా శంకరుడి టైప్. అందరినీ నమ్మేసే రకం. కానీ కెసీఆర్ రాజకీయ చాణక్యుడు. అలాంటి కెసీఆర్ ముందు కుప్పిగంతులు వేసిన ఫలితం. ఇప్పుడు ఆయన ఎన్ని విమర్శలు చేసినా, సెటైర్స్ వేసినా కుక్కినపేనుల్లా పడి ఉండాల్సిన పరిస్థితి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -