Saturday, May 4, 2024
- Advertisement -

మెగా సంబరాలకు ఒక్కనెలే మిగిలింది

- Advertisement -

మెగా సంబరాలు మొదలు కావడానికి కేవలం ఒకే ఒక నెల ఉంది. అంటే డిసెంబర్ 1న సాయిధరమ్ తేజ్ జవాన్ తో మొదలు పెడితే… మార్చినెలాఖరు వరకు వరుస పెట్టిన ప్రతినెల మెగా చిత్రాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇవన్నీ వస్తుంటే చాలామంది హీరోలు తన డేట్స్ విషయంలో ఓసారి ఆలోచించుకుంటున్నారు.

డిసెంబర్ 1న సాయి ధరమ్ తేజ నటించిన ‘జవాన్’ విడుదలౌతుంది. రాదు అనుకున్న ఈ ఫిలింను ఎలాగోలా ఫినిష్ చేసేసారు. బివిఎస్.రవి ఈ సినిమాకు డైరెక్టర్ .ఇక ఆతరువాత నెల జనవరి 10న పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ విడుదల అవుతుంది. పవన్& త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

ఆతరువాత నెలకు పోతే… వెంకి అట్లూరి తో వరుణ్ తేజ్ చేసిన సినిమా ఫిబ్రవరిలో విడుదల కానుంది. తమన్ సంగీతం ఈ సినిమాకు హైలెట్ అవుతుందని తెలుస్తుంది. సుకుమార్ చరణ్ కాంబినేషన్లో ‘రంగస్థలం’ చిత్రం మార్చి 29 న విడుదలకు సిద్ధమవతుంది. అల్లు అర్జున్ ‘నాపేరు సూర్య’ ఏప్రిల్ 27న అనే విషయం మనకు తెలిసిందే. అంటే వచ్చే ఏడాది మిడ్ వరకు మెగా హీరోల మేనియానే మార్కెట్లో వినిపిస్తుంది. మరి ఈ గోలకు ప్రతినెల చెక్ పెట్టే హీరో ఏ కాంపౌండ్ వాడవుతాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -