Thursday, May 16, 2024
- Advertisement -

సంక్రాంతికి తేలాల్సిన లెక్కలు చాలానే ఉన్నాయి

- Advertisement -

టాలీవుడ్ టాప్ హీరోలంతా పొంగల్ ఫైట్ కు రెడీ అవుతున్నారు. అయితే ఆ పోటీలో ఓ ఇద్దరు ముగ్గురు హీరోలు…. నువ్వా నేనా అని లెక్క తేల్చుకునే పనిలో పడ్డారు. దసరా కంటే మెరుగ్గా…పొంగల్ కు తగ్గట్టుగా ఎప్పటినుంచో చూడాలనుకుంటోన్న ఆ ఫైట్ ను జ‌నాలు చూడ‌బోతున్నారు.

ఇంత‌కీ ఆ డిష్యుం డిష్యుం లో ఫైట్ చేసుకునే ఆ మొన‌గాళ్లు ….. మహేష్ , పవన్ కళ్యాణ్.మహేష్  బ్రహ్మోత్సవంతో వస్తూ… మస్త్ మజా చేస్తానంటున్నాడు. ఈ సినిమాను బిజినెస్ మేన్ మాదిరిగా…. అతి తక్కువ టైమ్‌లోనే ఫినిష్ చేస్తానంటున్నాడు. దీని కోసమని కేవలం 90 రోజులు డేట్స్ ను ఎడ్జెస్ట్ చేస్తున్నాడు. ఆగస్ట్ 18న మొదలయ్యే బ్రహ్మోత్సవం నవంబర్ కు షూట్ పూర్తి చేసుకుని….డిసెంబర్ కు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను ముగించుకుంటుంది.

ఇక పొంగ‌ల్ కు  పవన్ కళ్యాణ్ సర్దార్ తో రావడానికి సమాయత్తమవుతున్నాడు. బాబి డైరెక్షన్లో వచ్చే ఈ సినిమా షూట్లో….. పవన్ ఎంతో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నాడు. డిసెంబర్ మొదటివారినికి సినిమాను ఎలాగైనా పూర్తి చేయాలని సర్దార్ జీ ఆదేశాలు  జారీ చేశాడట. ఈ లెక్కన చూస్తుంటే పవన్ కళ్యాణ్ …సంక్రాంతికి బెర్త్ కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా సరిగ్గా ఫైట్ చేసుకోని పవన్, మహేష్ లు తొలిసారి ఫైట్ కు రెడీ అవ్వడం సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

వీరిద్దరి ముచ్చట ఇలా ఉంటే….తారక్ సంగతి మరోలా ఉంది. సుకుమార్ సినిమా ఏదో వెంటనే అయిపోతుందని మనం అనుకుంటున్నాంగాని అది ఇప్పట్లో తేలేటట్లుగా లేదు. ఆ సినిమా ఎంత లేదన్నా నవంబర్ ,డిసెంబర్ కు గాని షూట్ ను ఫినిష్ చేసుకోదని తెలుస్తోంది. ఆ లెక్కన చూస్తే…తారక్ సైతం సంక్రాంతి రేసులో ఉంటాడా అని పరిశ్రమలో డిస్కషన్లు జరుగుతున్నాయి. ఒక వేల ఉంటే మాత్రం ట్రైయాంగిల్ ఫైట్ ఉండొచ్చు. ఒక వేల అదే జరిగితే థియేటర్ల కొరత రావడం ఖాయం.

ఎందుకంటే …. కేవలం ఒక్క సినిమా అంటేనే రెండు వేల స్క్రీన్స్ ఇవ్వడానికి నానా యాతన పడుతున్నారు. మరి అదే మూడు సినిమాలు ఒక్కసారంటే….. ఏ చిత్రానికి 1200 స్క్రీన్స్ మించి ఇవ్వడం కస్టం .ఆ లెక్కన చూస్తే… పవన్ ,మహేష్ ,తారక్ ల సినిమాలు ఫస్ట్ డే,ఫస్ట్ వీక్ కలెక్షన్స్ లలో వండర్స్ క్రియేట్ చేస్తాయనుకోవడం కల్లవుతుంది. సో ఏదేమైనా వీరు ముగ్గురు ఇలా మన ముందుకు వచ్చి విందు భోజనం ఇస్తామంటే సామాన్య ప్రేక్షకుడు కాదనకుండా ఉండగలడా చెప్పండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -