ఒక్క కన్నుగీటు సీన్‌తో నేషనల్ లేవల్లో క్రేజ్ సంపాదించుకుంది ప్రియా ప్రకాష్ వారియర్. ఆమె నటించిన సినిమా విడుదల కాకుండానే పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసీడర్‌గా వ్యవహారించింది. మళయాళంలో ఆమె నటించిన ఓరు ఆదార్ లవ్ సినిమాను తెలుగులో లవర్స్ డే పేరుతో తెలుగులో విడుదల చేశారు. కాని సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అయింది. అయితే ఈ సినిమాలో నటించిన మరో హీరోయిన్ నూరిన్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. నూరిన్,ప్రియా ప్రకాష్‌ను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. అసలు ముందుగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నూరిన్‌ను అనుకున్నారట.
కాకపోతే ఒక్క కన్ను గీటు సీన్‌తో ప్రియా ప్రకాష్ వారియర్ క్రేజ్ సంపాదించడంతో నూరిన్‌ను తప్పించి ప్రియా ప్రకాష్ వారియర్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారట. మొదట కథ మొత్తం నూరిన్ చూట్టు తిరిగేదని ఈ భామ చెబుతోంది. తరువాత సినిమా కథను మొత్తం మార్చి ప్రియా ప్రకాష్ వారియర్‌కు అనుకులంగా తీశారట. సినిమాలో తన ప్రాధన్యతను తగ్గించడంతో ఎంతో ఆవేదనకు గురైనట్లు చెప్పింది. ఇకపై ప్రియా వారియర్ తో కలిసి నటించే అవకాశం వస్తే ఒకటికి పదిసార్లు ఆలోచిస్తానని, నటించకుండా ఉండడానికే ప్రయత్నిస్తానని అంతగా ఆమె తన కెరీర్ ని గందరగోళంలో పడేసిందని వాపోయింది.
- Advertisement -
ప్రియా ప్రకాష్ వారియర్ వల్ల నా జీవితం నాశనం అయింది – నూరిన్
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -