Sunday, May 5, 2024
- Advertisement -

తగ్గేదే లే అంటున్న రాందేవ్ బాబా!

- Advertisement -

అల్లోపతి వర్సెస్ ఆయుర్వేదం వివాదం ముదురుతోంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆగ్రహానికి గురైన యోగా గురువు రాందేవ్ బాబా మరోసారి ఐఎంఏకు సవాల్ విసిరారు. అల్లోపతితో పోలుస్తూ కొందరు ఉద్దేశపూర్వకంగా ఆయుర్వేద వైద్యాన్ని తక్కువ చేసి చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో కరోనా టీకాలు వేసుకున్నప్పటికీ కొందరు మరణిస్తున్నారని, దీనిని బట్టే మనకు అల్లోపతి వైద్యం సమర్థత ఏపాటిదో అర్థం అవుతోందని అన్నారు. ఇంగ్లిష్ వైద్యం 100 శాతం పనిచేయదనడానికి ఇది నిదర్శనమన్నారు.

తాను కొన్ని దశాబ్దాలుగా యోగాను అభ్యసిస్తున్నానని, ఆయుర్వేదాన్ని అనుసరిస్తున్నానని పేర్కొన్న బాబా.. తనకు టీకాలతో పనిలేదన్నారు. భారత దేశంలో ఆయుర్వేద వైద్యానికి ఎంతో గొప్ప పేరు ఉందని.. మన పూర్వీకులు ఆయుర్వేద వైద్యంతోనే ఎంతో చక్కటి ఆరోగ్యాన్ని అందించారని.. అప్పట్లో ఎలాంటి అలోపతి మెడిసన్స్ లేవని అన్నారు. ఆయుర్వేద వైద్యాన్ని విదేశీయులు కూడా అనుసరిస్తున్నారని గుర్తు చేశారు.

భవిష్యత్తులో ఆయుర్వేద వైద్యానికి ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభిస్తుందని రాందేవ్ బాబా స్పష్టం చేశారు. కాగా, రాందేవ్ బాబా 15 రోజుల్లోగా లిఖిత పూర్వక క్షమాపణ చెప్పాలని.. లేకపోతే వేయి కోట్ల దావా వేస్తామని ఉత్తరాఖండ్ ఐఎంఏ నోటీసులు పంపింది. ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రదాని మోదీకు లేఖ రాసింది. దీనికి సమాధానంగా తనను అరెస్టు చేసే దమ్ము ఎవరికీ లేదని సవాలు విసిరారు.

సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు నేడు.. మహేష్ బాబు ఎమోషనల్ ట్విట్!

ఒక్క హిట్ తో బిజీగా మారిన కుర్ర హీరో!

క‌రోనాతో అనాథ‌లైన చిన్నారుల సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -