Wednesday, April 24, 2024
- Advertisement -

ప్రపంచంలోనే నన్ను సంతోష పెట్టే వ్యక్తి అతనొక్కడే!

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో చెప్పాల్సిన పని లేదు. మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ గాకొనసాగుతున్న నటి రేణు దేశాయ్ ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమయ్యే డ్రామా జూనియర్స్ ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఎంతో యాక్టివ్ గా ఉండే రేణు ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితులలో తన వంతు సాయంగా ఆపదలో ఉన్నవారిని సహాయం చేస్తున్నారు.

సోషల్ మీడియా వేదికగా సామాజిక మాధ్యమాల పై జరిగే సంఘటనలను గురించి స్పందిస్తూ అప్పుడప్పుడు అభిమానులతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహిస్తుంటారు.ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానులు తన కొడుకు అఖిరా సినిమా ఎంట్రీ గురించి పదేపదే ప్రశ్నలు అడుగుతుంటారు. ఈ విధంగా అభిమానుల నుంచి ఈ ప్రశ్న ఎదురైనప్పుడు ఎంతో చాకచక్యంగా అభిమానులు అడిగిన ప్రశ్నను రేణు దాటేస్తున్నారు.

Also read:అనిల్ రావిపూడి దర్శకత్వంలో యంగ్ హీరో.. ఎవరంటే?

ప్రస్తుతం ఉన్న ఈ విపత్కర పరిస్థితులలో అకీరా సినిమా ఎంట్రీ గురించి ఏమీ చెప్పలేనని సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెబుతానని చెప్పడంతో త్వరలోనే అకిరా సినిమా ఎంట్రీ ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే నటి రేణు దేశాయ్ తన ముద్దుల కొడుకు అఖిరాతో కలిసి దిగిన ఫోటోలు అభిమానులతో పంచుకున్నారు.ఈ ఫోటోని షేర్ చేస్తూ రేణుదేశాయ్ ఈ ప్రపంచంలో నన్ను చెప్పలేనంత ఆనందంతో, నవ్వులతో ముంచెత్తేది తన కొడుకు ఒక్కడేనని అకీరా వేసే జోకులు వింటే తనకు ఎంతగానో నవ్వు వస్తుందని తెలిపారు. ప్రస్తుతం నటి రేణు దేశాయ్ షేర్ చేసిన ఈ ఫోటో మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

Also read:కేజిఎఫ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా.. అసలు నిజం?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -