Friday, May 3, 2024
- Advertisement -

ఆనందయ్య గురించి బాలయ్య ఏమన్నాడంటే..!

- Advertisement -

గత ఏడాది నుంచి దేశ వ్యాప్తంగా కరోనా కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడక్కడ ఆకు పసరు మందులతో కరోనా నయం చేస్తాంమని నాటు వైద్యులు అంటున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య అనే ఆయుర్వేద వైద్యుడు తయారు చేసిన ఔషదం దేశ వ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్ మారింది. ఎంతోకాలంగా కృష్ణపట్నం చుట్టుపక్కల ప్రజలకు ఆయన వైద్యం చేస్తూ దీర్ఘకాలిక రోగాలను సైతం నయం చేస్తున్నారు.

కరోనా సెకండ్‌ వేవ్‌తో ప్రజలు అల్లాడుతున్న సమయంతో వనమూలికలు, ఔషధ మొక్కల ఆకులతో కరోనాకు మందు తయారుచేసి ఉచితంగా పంపిణీ చేపట్టారు. ఇది కాస్త సోషల్ మీడియాలో టాం టాం కావడంతో వేలాది మంది రావడం మొదలు పెట్టారు. అయితే ఈ మందు విషయంలో ప్రజలు భిన్నాభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. మరోవైపు మందును పరిశీలించిన ఆయుష్ అధికారులు దానిలో హానికరమైన పదార్థాలేవీ లేవని తేల్చడం పెద్ద ఊరట కలిగించింది. మరికొద్ది రోజుల్లో ఆనందయ్య మందుపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక ఆనందయ్యకు సినీ నటుల సపోర్ట్ కూడా దక్కుతుంది.

తాజాగా స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన తనయుడు, సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఆనందయ్య గురించి మాట్లాడుతూ.. ఆనందయ్య కరోనా మందుపై నాకు నమ్మకం ఉంది. అభిమానం లేనిదే ఆరాధన లేదు. ఆరాధన లేనిదే మతం లేదు. మతం లేనిదే మానవుడే లేడు. అలాగే ప్రతీది ఒక నమ్మకం..ఆయుర్వేదాన్ని నేను తప్పకుండా నమ్ముతాను.

మన దేశంలో అనాధిగా ఆయుర్వేద మందులు ప్రజలు ఎంతో నమ్మకంగా వాడుతున్నారు.. బాగు పడుతున్నారు. ఇది ఈనాటిది కాదు.. పూర్వ కాలం నుంచి మొక్కలు, మూలికల ద్వారా దివ్య ఔషదాలు తయారు చేస్తున్నారు. క్రీస్తు పూర్వమే సుశ్రుతుడనే వైద్యుడుండే వాడు. ఆ కాలంలోనే ఆయ ఓ గొప్ప సర్జన్. ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్‌లో ఉన్న రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జరీలో ఇప్పటికే ఆయన పేరు రాసుంటుందని అన్నారు.

ఎమ్మెల్యే బాల్క సుమన్ కు పితృవియోగం…

ఇద్దరు ప్రియులతో కలిసి భర్తను చంపేసింది!

కళ్యాన్ రామ్ ‘బింబిసార‌’ లుక్ అదుర్స్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -