Saturday, May 18, 2024
- Advertisement -

సినిమా ప్ర‌మోష‌న్స్‌కేనా బిగ్‌బాస్ రెండో సీజ‌న్‌..?

- Advertisement -

తెలుగులో మొట్ట మొద‌టి రియాల్టీ షోగా ప్రారంభ‌మైంది బిగ్‌బాస్.మొద‌ట బాలీవుడ్‌లో మొద‌లైన ఈ షో అక్క‌డ సూప‌ర్ హిట్ కావ‌డంతో త‌రువాత అన్ని బాష‌ల‌లో తీయడం మొద‌లు పెట్టారు. ఇక తెలుగు బిగ్‌బాస్ విష‌యానికి వ‌స్తే మొద‌టి సీజ‌న్‌తో పోలిస్తే రెండో సీజ‌న్ కాస్తా నిరాశ‌కు గురి చేసిందనే చెప్పాలి.మొద‌టి సీజ‌న్‌లో ఉన్న మ‌జా రెండో సీజ‌న్‌లో లేదు. పైగా బిగ్‌బాస్ రెండో సీజ‌న్ సెల‌బ్రిటీలు ఎవ‌రు పెద్ద‌గా ప్రేక్ష‌కుల‌కు తెలియ‌క‌పోవ‌డంతో రెండో సీజ‌న్ చూడ‌టానికి ఎవ‌రు పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌లేదు. రెండో సీజ‌న్ మొద‌టి నుంచి హౌస్‌లో గొడ‌వ‌లు, వివాద‌ల‌తోనే న‌డుస్తుంది.బిగ్‌బాస్ రెండో సీజ‌న్ మొత్తం ఓన్ మ్యాన్ ఆర్మీగా జ‌రుగుతుంది. ఇక బిగ్‌బాస్ రెండో సీజ‌న్ వ‌ల్ల ఎవ‌రికైనా లాభం క‌లిగిందా అంటే అది ఖ‌చ్చితంగా సినిమా వాళ్లే అని చెప్పాలి.

బిగ్‌బాస్ రెండో సీజ‌న్ మొద‌టి నుంచి ఏదో ఒక సినిమా యూనిట్ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లి త‌మ సినిమాను ప్రమోట్ చేసుకోని వ‌స్తున్నారు. గీతా గోవిందం ప్ర‌మోష‌న్స్ కోసం విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా బిగ్‌బాస్‌ని వినియోగించుకున్నాడు. ఆది పినిశేట్టి న‌టించిన నువ్వేవ‌రో, ల‌క్ష్మీ మంచు న‌టించిన వైఫ్ ఆఫ్ ల‌క్ష్మి, లోక నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ న‌టించిన విశ్వ‌రూపం-2, అడ‌వి శేష్ న‌టించిన గూడ‌ఛారి , తాజాగా సిల్లీ ఫెలోస్ మూవీ ప్రమోష‌న్స్‌లో భాగంగా అల్ల‌రి న‌రేష్‌, సునీల్‌లు బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లి త‌మ సినిమాల‌కు ప‌బ్లిసిటీ చేసుకున్నారు. బిగ్‌బాస్ వ‌ల్ల ఎవ‌రికి ఏం ఉప‌యోగం లేక‌పోయిన‌ప్ప‌టికి ఇలా సినిమా వాళ్ల‌కు మాత్రం బాగానే ఉప‌యోగ‌ప‌డుతుంది. సినిమా వాళ్లు కూడా బిగ్‌బాస్‌ను బాగానే ఉప‌యోగించుకుంటున్నారు. త‌మ సినిమాను జ‌నాల‌లోకి తీసుకువెళ్ల‌డానికి బిగ్‌బాస్‌ను ఒక ప‌బ్లిసిటీ స్టంట్‌గా ఉప‌యోగించుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -