Monday, April 29, 2024
- Advertisement -

రాజ‌కీయ పార్టీల‌తో భేటీకీ స‌మ‌యం కేటాయించిన ఈసీ…

- Advertisement -

తెలంగాణాలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ఏర్పాట్లు చ‌క‌చ‌కా జ‌రిగిపోతున్నాయి. ఎన్నిక‌ల ఏర్పాట్లుపై రేపు సీఈసీ ప్ర‌తినిధిబృందం హైద‌రాబాద్‌కు రానుంది. హైదరాబాద్‌లో రెండురోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించనుంది. తెలంగాణలో ఎన్నికల నిర్వహణ, పరిస్థితులపై అధ్యయనం చేయనుంది. ఈ నివేదిక ఆదారంగానే ఎన్నిక‌ల తేదీల‌ను ప్ర‌క‌టించ‌నుంది.

అయితే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో రేపు సాయంత్రం భేటీ కానుంది. సచివాలయంలోని సీఈవో కార్యాలయంలో సమావేశం ఉంటుంది. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు లేదా ముగ్గురు ప్రతినిధులకు సమావేశానికి అవకాశం ఉంటుందని తెలిపింది. సమావేశానికి 15 నిమిషాల ముందే ప్రాంగణంలో ఉండాలని పార్టీలకు సూచించింది.

పార్టీలకు కేటాయించిన సమయమిదే..

బీఎస్పీ- సాయంత్రం 6.30 నుంచి 6.40 వరకు
బీజేపీ-సా. 6.40 నుంచి 6.50
సీపీఐ-సా.6.50 నుంచి 7.00
సీపీఎం-రాత్రి 7.00 నుంచి 7.10
ఐఎన్‌సీ-రాత్రి. 7.10 నుంచి 7.20
ఎంఐఎం-రాత్రి 7.20 నుంచి 7.30
టీఆర్‌ఎస్-రాత్రి 7.30 నుంచి 7.40
టీడీపీ-రాత్రి 7.40 నుంచి 7.50
వైసీపీ-రాత్రి 7.50 నుంచి 8.00

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -