Sunday, May 5, 2024
- Advertisement -

మూడో సినిమానా?

- Advertisement -

త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ క్రేజ్ గురించి మ‌నం ప్ర‌త్యేకంగా చెప్పుకొవాల్సిన అవ‌స‌రం లేదు. ర‌జ‌నీ సినిమా రిలీజ్ అవుతుంటే త‌మిళ‌నాడుతో పాటు ఇండియా మొత్తం షేక్ అవుతుంది.మ‌రి అలాంటి హీరోతో ప‌ని చేయ‌ల‌ని ఏ ద‌ర్శ‌కుడికైనా ఉంటుంది.మ‌రి అలాంటి హీరోతో రెండు సినిమాలు చేశాడు పా.రంజిత్. ఒక్క సినిమా అనుభ‌వంతో ర‌జ‌నీతో ఎలా సినిమా చేస్తున్నాడని అంద‌రు మొద‌ట అభిప్రాప‌డ్డారు.

కాని క‌బాలి సినిమా ట్రైల‌ర్ చూశాక,సినిమాపై అంచ‌నాలు తార స్థాయికి చేరాయి.కాని క‌బాలి సినిమా పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. స్టార్ ద‌ర్శ‌కులు ర‌జ‌నీతో సినిమా చేయ‌డానికి రెడీగా ఉన్నా ఎందుక‌నో ర‌జ‌నీ మ‌ళ్లీ రంజిత్కే అవ‌కాశం ఇచ్చాడు.రంజిత్ ర‌జనీతో కాలా సినిమాను తెర‌కెక్కంచాడు.ర‌జ‌నీ సినిమా రిలీజ్ అవుతుంటే క‌నిపించే హంగామా ఈ సినిమాకు క‌నిపించలేదు.దీనికి కార‌ణం ద‌ర్శ‌కుడు రంజిత్ అనిచెప్పాల్సిన అవ‌స‌రం లేదు.నిన్న రిలీజ్ అయిన కాలా సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.

కథలో పట్టు లేదు. ఎన్నో ఆశలు పెట్టుకొని వచ్చిన అభిమానులకు రొటీన్ గానే కొట్టింది. అయితే ఇప్పుడు రంజిత్- రజినీకాంత్ తో మరో సినిమా కూడా చేస్తాడని తెలుస్తోంది. పా.రంజిత్ చెప్పిన మూడో కథను తలైవా ఒకే చేశాడని టాక్ దీంతో ర‌జ‌నీ అభిమానులు భ‌య‌ప‌డుతున్నారు.రంజిత్‌కు దండం పెడతం బాస్‌తో సినిమా తీయ‌కు అని వేడుకుంటున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -