Friday, March 29, 2024
- Advertisement -

దీపిక కోసం అక్ష‌య్‌కుమార్ త్యాగం

- Advertisement -
  • ప‌ద్మావ‌త్ కోసం ప్యాడ్‌మ్యాన్ వాయిదా

తెలుగులో మాదిరి బాలీవుడ్‌లో ఉండ‌దు. పైగా అక్క‌డ వేల థియేట‌ర్లు ఉన్నాయి. అయినా బాలీవుడ్ ప‌రిశ్ర‌మ‌కు చెందిన‌వారు సుహృద్భావంతో మెలుగుతుంటారు. అదే తెలుగులోనైతే త‌మ సినిమాలు విడుద‌ల కావాలంటే త‌మ‌వి కావాల‌ని ఓ పోటీ ప‌డి మ‌రీ అన్నీ సినిమాలు ఒకేసారి విడుద‌ల చేస్తుంటారు. వీటితో సినిమాకు థియేట‌ర్ల కొర‌త ఏర్ప‌డి కొన్ని సినిమాలు న‌ష్ట‌పోవాల్సి వ‌స్తోంది. ప్ర‌ణాళిక ప్ర‌కారం వెళ్లితే ప‌రిశ్ర‌మ‌కు, సినీ న‌టుల‌కు కూడా మంచి అవ‌కాశం ఉంటుంది. ఇదంతా ఎందుకంటే హిందీలో ప‌ద్మావ‌త్ సినిమా కోసం ప్యాడ్‌మ్యాన్ సినిమా వాయిదా వేసుకున్నారంట‌.

వివాదాల‌తో పద్మావత్ సినిమా విడుద‌లకు సిద్ధ‌మైంది. సుప్రీంకోర్టు తీర్పుతో దర్శకుడు సంజయ్ లీల భన్సాలీ త‌న సినిమాను జ‌న‌వ‌రి 25వ తేదీన విడుద‌ల చేయాల‌ని ఫిక్స‌య్యాడు. ప్ర‌క‌టించేశాడు. అయితే ఇప్ప‌టికే వివాదాల‌తో న‌ష్ట‌పోయిన సినిమాకు తాను వ‌స్తే ఇక న‌ష్టాలు వ‌స్తాయ‌ని భావించిన అక్షయ్‌కుమార్‌ను తాను న‌టించిన సినిమాను వాయిదా వేసుకున్నాడు. గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా అక్ష‌య్‌కుమార్ ప్యాడ్‌మాన్‌గా రావాల్సి ఉంది. కానీ ఫిబ్రవరి 9వ తేదీకి వాయిదా వేసుకున్నాడ‌ట‌. ఈ విధంగా ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో బాలీవుడ్ వెలుగుతోంది. ఈ విధంగా తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోనూ వ‌స్తే అంద‌రికీ మంచి జ‌రుగుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -