Friday, April 19, 2024
- Advertisement -

ప‌ద్మావ‌తి విడుద‌ల‌వుతోంది..

- Advertisement -
  • ఇక్క‌డ లేకున్నా విదేశాల్లో
  • డిసెంబ‌ర్ 1న లండ‌న్‌లో విడుద‌ల‌

ఏ సినిమాకు రాన‌న్ని వివాదాలు, గొడ‌వలు, హెచ్చ‌రిక‌లు, బెదిరింపులు ప‌ద్మావ‌తికి వ‌చ్చాయి. ఈ సినిమాపై దేశం మొత్తం ర‌గ‌డ మొద‌లైంది. చివ‌రికి రాద్ధాంతం చేసే వాళ్లే గెలిచారు. అధికార వ‌ర్గంతో క‌లిసి ఎట్ట‌కేల‌కు సినిమాను అడ్డుకున్నారు. సినిమా విడుద‌ల‌ను నిలిపివేశారు. దేశంలో ఈ సినిమా డిసెంబ‌ర్ 1వ తేదీన తీసుకురావ‌ల‌నుకున్న నిర్ణ‌యం వాయిదా ప‌డింది. దీంతో ఇప్పుడు సినీ ప‌రిశ్ర‌మ‌లో కొంచెం ప్ర‌శాంత వాతావ‌ర‌ణం క‌నిపిస్తోంది. ప్ర‌భుత్వ పెద్ద‌లే ద‌గ్గ‌రుండి వాయిదా వేశార‌ని టాక్ వినిపిస్తోన్న నిజాలు ఇంకా తెలియ‌రాలేదు. ఇక ఈ సినిమా భార‌త‌దేశంలో విడుద‌ల కాకుంటే ఏమీ విదేశీయులు ఆద‌రించ‌డానికి ముందు ఉన్నారు. ఏ వివాదాలు వ‌చ్చినా వారినేమీ చేయ‌వు. వాళ్లు సినిమాను సినిమాగానే చూస్తారు. అందుకే విదేశాల్లో వివాదాస్ప‌ద సినిమాలు స్వేచ్ఛ‌గా విడుద‌ల అవుతాయి.

అందులో భాగంగా ప‌ద్మావ‌తి సినిమాను విదేశాల్లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఎట్ట‌కేల‌కు డిసెంబ‌ర్ 1వ తేదీన యూకే లండ‌న్‌లో విడుద‌ల అవుతుంద‌ని చిత్ర బృందం ప్ర‌కటించింది. ఈ సినిమా విడుద‌ల చేసుకునేందుకు బ్రిటీష్ సెన్సార్ బోర్డు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ సినిమాను సంజ‌య్‌లీలా భ‌న్సాలీ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నాడు. ఎట్ట‌కేల‌కు చిత్ర బృందం తాము అనుకున్న మాదిరి ప్రాంతం మారింది కానీ సినిమా విడుద‌ల ఆగ‌లేద‌ని ధీమా వ్య‌క్తం చేస్తోంది. గొడ‌వ‌లు చేస్తున్న వారు వెళ్లి విదేశాల్లో అడ్డుకోవాల‌ని సినీ ప్ర‌ముఖులు ఎద్దేవా చేస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -