Friday, May 3, 2024
- Advertisement -

జ‌గ‌న్ అంటే ప్రాణం ఆ రెండు నియోజ‌క వ‌ర్గాల్లో వైఎస్ఆర్‌సీపీ గెలుస్తుంది….

- Advertisement -

పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి బాబు స‌మ‌క్షంలో టీడీపీలో చేరారు. పార్టీలో చేరినందుకు రూ.25 కోట్ల ప్యాకేజీ అందుకుదంటూ వైసీపీ ఆరోపించింది. ఇది ఎక్క‌డైనా స‌హ‌జ‌మే. ఫార్టీ ఫిరాయించిన వారంతా కొత్త పార్టీ అండ‌చూసుకొని..పాత పార్టీని విమ‌ర్శించ‌డం కొత్తేమి కాదు. అయితే గిడ్డి ఈశ్వ‌రి విష‌యంలో మాత‌రం సీన్ రివ‌ర్స్ అయ్యింది. జ‌గ‌న్‌పై ఉన్న త‌న అభిమానాన్ని చంపుకోలేక పోయింది. జ‌గ‌న్ గురించి త‌న మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట‌పెట్టింది.

ప‌చ్చ‌ఖండువా క‌ప్పుకున్న తర్వాత మీడియాతో బాబుకు షాక్ ఇచ్చేలా …జ‌గ‌న్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. నసు చంపుకుని టీడీపీలో చేరుతున్నట్లు చెప్ప‌టంతో అక్క‌డున్న టీడీపీ నేత‌లంతా అవాక్క‌య్యారు. రాజకీయంగా భిక్ష పెట్టింది వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డేన‌ని.. వైఎస్సార్సీపీని వీడటం చాలా బాధగా ఉంద‌న్నారు. 2019 ఎన్నికల్లో పాడేరు సహా అరకు నియోజకవర్గంలోనూ వైఎస్సార్సీపీనే గెలుస్తుంద‌న్నారు. గతంలో బాక్సయిట్‌ వివాదంలో తల నరుకుతానన్న వ్యాఖ్యలకు (సీఎం చంద్రబాబుని ఉద్దేశించి) కట్టుబడి వున్నాను..’ అంటూ గిడ్డి ఈశ్వరి వ్యాఖ్యానించారు.

ఇది నిజంగానే వెరైటీ. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే టీడీపీలో చేరినందుకు చంద్రబాబు సంతోషించడానికి వీల్లేకుండాపోయింది. ఎందుకంటే, సైకిలెక్కాక కూడా గిడ్డి ఈశ్వరి వైఎస్‌ జగన్‌ జపమే చేశారు మరి. టీడీపీకి ఆ నియోజకవర్గాల్లో ఓటమి తప్పదనే కదా అర్థం.! మనసు చంపుకుని టీడీపీలో చేరడమేంటట.? ఇంతకన్నా చంద్రబాబుకి అవమానం ఇంకోటుండదు.

ఈ మధ్యకాలంలో జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు నచ్చలేదు. కోట్లు ఉంటేనే సీట్లు ఇస్తామని చెప్పారు. పార్టీకి ఉపయోగం లేని వాళ్లకు సీట్లు ఇస్తున్నారని.. పార్టీ కోసం కృషి చేసిన వాళ్లకు ఇవ్వడం లేదు ఇదే విషయంపై జగన్ తో మాట్లాడాను. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పాడేరులో గెలిపిస్తానని హామీ ఇచ్చాను. బతిమిలాడాను అయినా కూడా నిర్ధాక్షణ్యంగా నన్ను పార్టీ నుంచి బయటకు పంపించారు.’’ అంటూ ఈశ్వరి తన ఆవేదనను తెలియజేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -