Thursday, April 25, 2024
- Advertisement -

విమర్శించండి.. దాడి చేయొద్దు.. వైరల్ గా మారిన విశ్వక్ సేన్ లేఖ..!

- Advertisement -

విశ్వక్ సేన్ హీరోగా నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నరేష్ కుప్పిలి దర్శకత్వంలో వచ్చిన సినిమా పాగల్. దిల్ రాజు సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ సినిమాను నిర్మించారు. ఈ మూవీ ఈనెల 14వ తేదీన థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పాగల్ సినిమాతో మూతపడ్డ థియేటర్లను తెరిపిస్తానని, అలా జరగకపోతే నా పేరు మార్చుకుంటా’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

అయితే విశ్వక్ సేన్ వ్యాఖ్యల పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆయన మాటలు మరీ శృతి మించాయనే కామెంట్లు వినిపించాయి.కాగా..ఈ సినిమా విడుదలై నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో సోషల్ మీడియాలో విశ్వక్ సేన్ పై విమర్శల దాడి జరుగుతోంది. విశ్వక్..మాట నిలుపుకో లేక పోయావుగా.. ఇంతకూ పేరు మార్చుకుంటున్నవా.. మార్చుకుంటే ఏం పేరు పెట్టుకుంటున్నావ్.. వంటి కామెంట్స్ వస్తున్నాయి.

దీనిపై తాజాగా విశ్వక్ స్పందించాడు. అభిమానులు విమర్శకులను ఉద్దేశించి ఓ లేఖ రాశాడు. ‘నేను విశ్వక్ సేన్. నన్ను ఇంతగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతదూరం వచ్చిన నన్ను.. పాగల్ సినిమాను ఆదరిస్తారని.. సెకండ్ వేవ్ తర్వాత మళ్లీ తెరిచిన సినిమా థియేటర్లను నిలబడతారని కోరుకుంటున్నాను.మా ప్రయత్నం లో మీకు ఏదైనా చిన్న లోపం కనిపిస్తే విమర్శించండి. కానీ దయచేసి దాడి చేయకండి. తట్టుకునే శక్తి ఉన్నా.. లేకపోయినా ఎన్నో వేల మందికి ఉపాధి ఇచ్చే సినిమా థియేటర్లను కాపాడండి. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన నాకు మీరే అండ..దండ..’ అని విశ్వక్ సేన్ ఆ లేఖలో పేర్కొన్నాడు. సినిమా పరాజయం తర్వాత సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై విశ్వక్ సేన్ మనస్తాపం చెందే ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది.

Also Read: హుద్ హుద్ కాదు.. ‘భీమ్లా’ తుఫాన్.. ఇప్పట్లో తీరం దాటేలా లేదు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -