Friday, April 26, 2024
- Advertisement -

తమ్ముడి సినిమాకు పోటీగా అన్నయ్య సినిమా విడుదల… ప్రచారంలో నిజమెంత..!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కాజల్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. కరోనా సెకండ్ వేవ్ తర్వాత అగ్ర హీరోల సినిమాలు అన్నీ విడుదల తేదీని ఫిక్స్ చేసుకున్నాయి. రాజమౌళి ఆర్ఆర్ఆర్, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్ తదితరులు తమ సినిమాల విడుదల తేదీని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ మూవీ జనవరి 12న సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నారు.

అయితే ఈ సినిమాలు అన్నింటి కంటే ముందుగానే షూటింగ్ పూర్తి చేసుకున్న చిరంజీవి ఆచార్య మూవీ విడుదల తేదీని మాత్రం మేకర్స్ ప్రకటించలేదు. దీనిపై కొద్ది రోజులుగా అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అన్ని సినిమాల డేట్లు ఫిక్స్ అయినప్పటికీ ఆచార్య సినిమా విడుదల తేదీని ఎందుకు ఖరారు చేయడం లేదంటూ..అభిమానులు కొద్దిరోజులుగా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా ఆచార్య సినిమా వచ్చే ఏడాది జనవరి 7వ తేదీన విడుదల కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే 12వ తేదీన చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవుతుండగా.. ఐదు రోజులకు ముందు అన్నయ్య సినిమాను విడుదల చేయడం ఏమిటనే ప్రశ్నలు అభిమానుల నుంచి వస్తున్నాయి.అయితే ఈ సినిమా విడుదల తేదీని డైరెక్టర్ కొరటాలశివ ఫిక్స్ చేసినట్లు సమాచారం. అయితే ఈ తేదీ ఫిక్స్ చేయడంపై చిరంజీవి అభ్యంతరం తెలిపినట్లు తెలుస్తోంది.

తమ్ముడు సినిమా కు ఐదు రోజుల ముందు ఆచార్య విడుదల వద్దని ఆయన అన్నట్లు సమాచారం. అంతగా అయితే సినిమాను మరిన్ని రోజులు వాయిదా వేసి జనవరి 27వ తేదీన విడుదల చేసినా పర్వాలేదని అన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఆచార్య విడుదలపై అభిమానుల్లో గందరగోళం నెలకొంది. ఈ సినిమా విడుదల పై మేకర్స్ క్లారిటీ ఇస్తే తప్ప ఇది తీరేలా కనిపించడం లేదు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలను ఆలస్యం చేయొద్దని వీలైతే తొందరగా విడుదల చేయాలని అభిమానులు కోరుతున్నారు.

Also Read: ఎవరూ ఊహించని కాంబినేషన్.. పాన్ ఇండియా హీరోల మల్టీ స్టారర్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -