పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ అజమ్ … జర్నలిస్ట్,యంకర్ అయిన జైనాబ్ అబ్బాస్‌కు వార్నింగ్ ఇవ్వడం సంచలనంగా మారింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే…పాకిస్థాన్ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతుంది.దీనిలో భాగంగా రెండో టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్థాన్ ప్లేయర్ బాబర్ అజమ్ (127) సెంచరీతో చెలరేగాడు. కెరీర్‌లో తొలి టెస్ట్ సెంచరీ సాధించిన బాబర్ అజమ్‌పై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. అతని సెంచరీపై జర్నలిస్ట్,యంకర్ అయిన జైనాబ్ అబ్బాస్ ప్రశంసిస్తు ఓ ట్వీట్ చేసింది.అయితే ఆమె చేసిన ట్వీట్‌పై అజయ్ మండిపడుతున్నాడు.బాబర్ స్పందిస్తూ.. ‘ఎదైనా చెప్పాలనుకునే ముందు ఒకసారి ఆలోచించు.
నీ హద్దులు దాటడానికి ప్రయత్నించవద్దు’ అని ఘాటుగా బదులిచ్చాడు. ఇంతకీ ఆ యాంకర్ ఏమన్నదంటే.. ‘బాబర్ అజమ్ అద్భుతంగా ఆడాడు. మిక్కీ ఆర్థర్ తన కొడుకు సెంచరీని ఆస్వాదిస్తున్నాడని ట్వీట్ చేసింది జైనాబ్.జైనాబ్ చేసిన ట్వీట్‌ను తప్పుగా అర్థం చేసుకున్న అజయ్ ఆమెపై ఫైర్ అయ్యాడు.దక్షిణాప్రికా మాజీ క్రికెటరైన మిక్కీ అర్థర్ పాక్ జట్టు ప్రస్తుత కోచ్ అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ట్వీట్‌ను బాబర్ తప్పుగా అర్థం చేసుకున్నాడని కొందరు.. జైనాబ్ అబ్బాస్‌ది తప్పేనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
https://www.youtube.com/watch?v=5RLI1WGnLHg