‘అజ్ఞాతవాసి’ సినిమా తరువాత రాజకీయాల వైపు వెళ్లిపోయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల వైపు చూడనని ఇప్పటికే చాలా సార్లు క్లారిటీ ఇచ్చారు. అయితే అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ ని వెండి తెరపై చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పరుచూరి గోపాలకృష్ణ పవన్ కళ్యాణ్ కి ఒక మంచి సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. పవన్ సినిమాలకు గుడ్ బై చెప్పడం మీద రెండు ఆర్గ్యుమెంట్లు వినిపిస్తున్నాయి. కొందరేమో ఒక అయిదారేళ్లు పవన్ కళ్యాణ్ సినిమాలు చేయకపోతే ఇండస్ట్రీలోనూ, అభిమానుల్లోనూ తన కి ఉన్న క్రేజ్ బాగా తగ్గిపోతుంది అని వాదిస్తున్నారు.
మరికొందరేమో మళ్లీ తదుపరి ఎలక్షన్లు వచ్చేంత వరకు రాజకీయాల లోనే ఉంటే మిగతా రాజకీయ నాయకులందరూ జనసేనని పవన్ కళ్యాణ్ ని పార్ట్ టైం పొలిటీషియన్ అని అంటూ హేళన చేస్తారు అని మరికొందరు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పరుచూరి గోపాలకృష్ణ పవన్ కళ్యాణ్ ను కలిసి ఎం జీ ఆర్ లాగా అటు సినిమాలు ఇటు రాజకీయాలు కూడా బ్యాలెన్స్ చేయడం నేర్చుకోమని మంచి సలహా ఇచ్చారట. పైగా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ ఉంటే ప్రేక్షకులలో కూడా పవన్ కళ్యాణ్ మీద ఉన్న క్రేజ్ ఇంకా పెరుగుతుందని, అది రాజకీయాల్లో కూడా తనకి ఉపయోగపడుతుందని సలహా ఇచ్చారట. మరి ఈ సలహాని పవన్ కళ్యాణ్ ఎంతవరకు పాటిస్తారో చూడాలి.