Saturday, April 27, 2024
- Advertisement -

అజ్ఞాత‌వాసిలో గురుగారు సంక్రాంతి రోజు

- Advertisement -

పవన్‌కల్యాణ్ నటించిన ‘అజ్ఞాతవాసి’లో సీనియ‌ర్ న‌టుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్ కనిపిస్తాడని స‌ర్వ‌త్రా తెలిసిందే.. త్రివిక్రమ్‌ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమా మొన్న విడుద‌ల‌య్యింది. అయితే ఈ సినిమాలో వెంక‌టేశ్ క‌నిపిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. వెంకీ పాత్ర బ‌లంగా ఉండి సినిమాకు హైలెట్ ఉంట‌ద‌ని ప్రచారం కొన‌సాగింది. అయితే సినిమా విడుద‌ల త‌ర్వాత వెంక‌టేశ్ సినిమాలో క‌నిపించ‌లేదు. దీంతో సినిమా చూసిన ప్రేక్ష‌కుల‌కు నిరాశ క‌లిగింది. అయితే ఈ సినిమాలో వెంకటేశ్ త్వ‌ర‌లో క‌నిపిస్తాడ‌ట‌.

అయితే అజ్ఞాత‌వాసి సినిమా బృందం సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా వెంకీని ప్ర‌వేశ‌పెడ‌తార‌ట‌. వెంకటేశ్‌, పవ‌న్‌కల్యాణ్‌ మధ్య వచ్చే సన్నివేశాన్ని సంక్రాంతి సందర్భంగా సినిమాలో చేర్చ‌నున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం ప్ర‌క‌టిస్తూ పవన్‌, వెంకటేశ్ ఉన్న ఓ వీడియోను విడుదల చేశారు. కొడ‌కా కోటేశ్వ‌ర్రావు పాట‌లో పవన్‌..వెంకీని ‘గురువుగారూ..’ అంటాడు. వెంక‌టేశ్ గురు సినిమా చేయ‌డంతో పాటు ప‌వ‌న్‌కు గురువులాంటివారే. దీనికి వెంటనే వెంకీ స్పందిస్తూ..‘గారు అక్కర్లేదమ్మా.. గురువు చాలు’ అని పాట‌లో అన్నారు. నిజంగా అంటే ఈ వీడియోలో ఉంది. ఆ తరువాత పవన్ ‘నాకు కొంచెం తిక్కుంది..’ అని అన‌గా వెంక‌టేశ్ ‘కానీ దానికో లెక్కుంది’ అని అంటారు.

‘అజ్ఞాతవాసి’లో పవన్‌కి జోడీగా అను ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేశ్‌ నటించారు. హారిక-హాసిని క్రియేషన్స్ బ్యాన‌ర్‌లో వ‌చ్చిన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. మ్యూజిక్ అనిరుధ్ అందించాడు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -