- Advertisement -

ప‌వ‌న్ బ‌ర్త్ డే స్పెష‌ల్… రామ్ చ‌ర‌ణ్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్!

- Advertisement -

సెప్టెంబర్ 2 జ‌న‌సేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. పుట్టిన రోజు ఘ‌నంగా నిర్వహించ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు ఆయ‌న అభిమానులు.ఇక బాబాయ్ పుట్టిన రోజు సంద‌ర్భంగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానుల‌కు ఓ స్పెష‌ల్ గిఫ్ట్ ఇవ్వ‌బోతున్నాడ‌ని తెలుస్తుంది.ప్రస్తుతం రామ్ చరణ్.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ కానీ, టైటిల్ కానీ రిలీజ్ కాలేదు.

పవన్ పుట్టిన రోజున ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ లేనప్పటికీ ఫస్ట్ లుక్ పోస్టర్ పవన్ పుట్టినరోజు నాడు రావడం ఖాయమని అంటున్నారు.చిరు పుట్టినరోజు కానుకగా విడుదల చేసిన సైరా టీజ‌ర్‌కు సూప‌ర్బ్ రెస్ప‌న్స్ వ‌చ్చింది.మ‌రి బాబాయ్ పుట్టిన రోజు అబ్బాయ్ సినిమా ఫ‌స్ట్ లుక్ వ‌స్తే మెగా అభిమానుల‌కు పెద్ద పండ‌గే అని చెప్పాలి.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -