Wednesday, May 8, 2024
- Advertisement -

రామ్ గోపాల్ వర్మకు పవన్ ఫ్యాన్స్ నివాళి!

- Advertisement -

దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు నివాళి ఘటించారు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్. ఇటీవల వర్మ ట్వీట్ల తో ఒళ్లు మండిన వీళ్లు ఆర్జీవీ పై ఈ విధఃగా విరుచుకుపడ్డారు.

 

వర్మ చనిపోయాడని.. ఆయనకు తాము నివాళి ఘటిస్తున్నామని వీరు ఫేస్ బుక్ లో పోస్టులను షేర్ చేస్తున్నారు. తాము ఆనంద భాష్పాలతో వర్మకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని వారు పోస్టులు పెట్టారు. ఇటీవల వర్మ ట్వీట్లతో పవన్ ఫ్యాన్స్ కు ఇబ్బంది ఎదురైన విషయం తెలిసిందే. ట్విటర్ లో మహేశ్ కు ఎక్కువమంది ఫ్యాన్స్ ఉన్నారని,  పవన్ కు తక్కువమంది ఫ్యాన్స్ ఉన్నారని.. ఇది పవన్ కు అవమానమని వర్మ ట్వీట్ చేశాడు.

ఈ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ ఆర్జీవీకి నివాళి ఘటించి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరి వర్మ ఏమీ తక్కువ వాడు కాదు కదా.. అందుకే ఆయనా తిరిగి రిటర్న్ ఇచ్చాడు. పవన్ ఫ్యాన్స్ కు చదువురాదని మరోసారి ఎద్దేవా చేశాడు. వారికి ఇంగ్లిష్ రాదు అని.. కాబట్టి మహేశ్ బాబు ఫ్యాన్స్ వారికి చదువు చెప్పాలని, ఇంగ్లిష్ నేర్పించాలని వర్మ ట్వీట్ చేశాడు. పవన్ ఫ్యాన్స్ తనకు నివాళి ఘటిస్తూ పెట్టిన పోస్టులనే వర్మ ట్వీట్ చేశాడు. మళ్లీ పవన్ ఫ్యాన్స్ పై పంచ్ లు వేశాడు. మహేశ్ బాబు ఫ్యాన్స్ ఇన్ వాల్వ్ చేస్తూ.. వారు పీకే ఫ్యాన్స్ కు ఇంగ్లిష్ నేర్పించాలని వర్మ ఎదురుదాడి చేశాడు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -