Wednesday, May 15, 2024
- Advertisement -

దుర్గమ్మ ఆశీస్సులతో జగన్ ముందుకు…!

- Advertisement -

ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేకహోదా దీక్షకు సిద్ధం అయ్యారు.

ముందుగా ప్రకటించినట్టుగా ఆయన గుంటూరు లో నిరవధిక నిరాహార దీక్షకు సిద్ధం అవుతున్నాడు. విశేషం ఏమిటంటే ఈ దీక్షకు ముందు జగన్ విజయవాడకు వెళ్లి అక్కడ కనకదుర్గ దేవాలయాన్ని దర్శించుకోనున్నాడు. దుర్గమ్మ ఆశీస్సులు పొంది జగన్ దీక్షకు కూర్చోబోతున్నాడు. ఇప్పటికే జగన్ దీక్షకు బయలుదేరాడు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత నెలలోనే ప్రత్యేక హోదా అంశం గురించి దీక్షను చేపట్టాలని భావించాడు. అయితే చంద్రబాబు ప్రభుత్వం దానికి అనుమతినీయలేదు. 

అప్పటికప్పుడు కోర్టుకు వెళ్లినా జగన్ పార్టీకి ఊరట దక్కలేదు. దీంతో దీక్షను వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు దీక్షకు సిద్ధం అవుతున్నారు. అయితే నిరవధిక నిరాహార దీక్ష అంటున్నారు కాబట్టి.. దీనికి ప్రభుత్వం అంతరాయం కలిగించే అవకాశాలున్నాయి. దీక్షను ప్రారంభించాకా ఎప్పుడు ముగించేదీ జగన్ ప్రకటించలేదు. దీంతో ప్రభుత్వమే ఈ విషయంలో ఇన్ వాల్వ్ అయ్యి.. దీక్షకు భంగం కలిగించాల్సి ఉంది. దానికి రెండు మూడు రోజుల వరకూ పట్టవచ్చు. జగన్ చేత దీక్ష విరమింపజేయడానికి జగన్ ప్రభుత్వం బలప్రదర్శన కూడా చేయవచ్చు. 

ఇక ఈ దీక్ష వేదిక నుంచి జగన్ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. ప్రత్యేకహోదా విషయంలో ఆ పార్టీలు మోసం చేస్తున్నాయని…జగన్ ధ్వజమెత్తే అవకాశం ఉంది. మొత్తానికి జగన్ దీక్ష ఉద్రిక్తతను రేకెత్తించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతినిమిషం ఆసక్తికరమైనదే! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -