Wednesday, May 15, 2024
- Advertisement -

శ్రీమంతుడు సైకిల్.. సొంతం చేసుకోవాలనుందా? ఇది చదవండి!

- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘శ్రీమంతుడు’ సినిమాలో మహేశ్ బాబు వాడిన సైకిల్.. తెరపై కనిపిస్తూ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సైకిల్ ను సొంతం చేసుకోవాలని ఉందా? ఇందు కోసం సరికొత్త అవకాశాన్ని ఇస్తోంది ఆ సినిమా యూనిట్.

తమ అభిమాన హీరో వాడిన సైకిల్ ను సొంతం చేసుకోవాలనే వారి కోసం…బిడ్డింగ్ ను మొదలు పెట్టారు. ఈ బిడ్డింగ్ లో పాల్గొని ఎవరైనా ఆ సైకిల్  సొంతం చేసుకోవచ్చు.. అదృష్టం వరించడంతో… వారు కూడా శ్రీమంతులు కావొచ్చు! 

బిడ్డింగ్ కు పేరు నమోదు ఇలాః http://www.livastar.com/iamsrimanthudu ను సందర్శించి పేరును నమోదు చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ కోసం రూ.999 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా రిజిస్టర్ చేయించుకున్న వాళ్లు శ్రీమంతుడు సైకిల్ ను పొందడడానికి అర్హులు.

అదృష్టవంతులకు అవకాశంః ఇలా పేర్లను నమోదు చేయించుకున్న వాళ్లలో ఒకరికి లక్కీ డిప్ ద్వారా ఒకరిని ఎంపిక చేసి ఆ సైకిల్ ను ఇస్తారు. బ్రహ్మోత్సవం ఆడియో వేడుకలో ఈ సైకిల్ ను అదృష్టవంతుడికి అప్పగిస్తారు. 

మొత్తం మూడు సైకిల్స్ ఉన్నాయి. శ్రీమంతుడులో మహేశ్ ఆ మూడు సైకిళ్లనూ వాడాడు. వాటి ఒరిజినల్ కాస్ట్ దాదాపు మూడున్నర లక్షల రూపాయలు. అయితే అభిమానులకు మాత్రం రూ.999 కే ఇస్తున్నారు. బిడ్డింగ్ ద్వారా వచ్చిన డబ్బును సోషల్ సర్వీస్ కు వినియోగించనున్నట్టుగా ప్రకటించారు. కాబట్టి.. ఇది అభినందించదగిన అంశమే! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -