Thursday, May 16, 2024
- Advertisement -

అది.. కత్తి సినిమాలో గెటప్పట

- Advertisement -

ఈ మధ్య తన చిన్న కూతురు శ్రీజ పెళ్లిలో మెగాస్టార్ చిరంజీవి చాలా కొత్తగా కనిపించారు. ముదిరిన గడ్డంతో.. తన అసలు వయసును చూపిస్తూ.. పెద్ద మనిషిగా అగుపించారు. ఈ గడ్డం పెంచే వ్యవహారం వెనక.. కాస్త పెద్ద కథే ఉందని ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్లూ కూతురు పెళ్లి హడావిడిలో ఉన్న చిరంజీవి.. ఇప్పుడిప్పుడే తేలిక పడుతున్నారని కొందరు చెబుతున్నారు. పనిలో పనిగా.. కత్తి సినిమాపైనే ఓ కన్నేసి ఉంచారని డౌట్ పడుతున్నారు.

కత్తి సినిమాలో కీలకమైన క్యారెక్టర్ కోసమే.. కూతురి పెళ్లి అని కూడా ఆలోచించకుండా… విపరీతంగా గడ్డం పెంచేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకూ.. ఇటు మెగా క్యాంప్ నుంచి.. అటు డైరెక్టర్ గా దాదాపు కన్ఫమ్ అయిన వీవీ వినాయక్ నుంచి.. ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు.

దీంతో.. గడ్డం కథ ఏమై ఉంటుందా అని అభిమానులైతే రకరకాలుగా లెక్కలేసుకుంటున్నారు. ఈ విషయంపై చిరంజీవి కుటుంబ సభ్యులు కానీ.. కనీసం కత్తిని రెడీ చేస్తున్న వీవీ వినాయక్ టీమ్ సభ్యులు కానీ క్లియర్ చేస్తే తప్ప.. అయోమయం తీరేలా కనిపించడం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -