Saturday, May 4, 2024
- Advertisement -

18న అజ్ఞాత‌వాసి పాట‌ల విడుద‌ల‌

- Advertisement -
  • సంక్రాంతికి సినిమా విడుద‌ల‌

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌రోసారి న‌టిస్తున్న విష‌జ్ఞం తెలిసిందే. పవన్‌కల్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘అజ్ఞాతవాసి’. ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ ఇటీవల విడుద‌ల చేశారు. పాట‌ల‌ను కూడా విడుద‌ల చేయడానికి ప్లాన్ చేసింది చిత్ర బృందం. డిసెంబర్ 18వ తేదీన ఆడియో వేడుకను అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వై దిస్ కొల‌వెరీ పాటతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా పేరొందిన‌, త‌మిళంలో ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడిగా పేరొందిన అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఆ కుర్రాడే మ్యూజిక్ డైర‌క్ట‌ర్‌. ఈ సినిమాలో పవన్ ఓ మాస్ పాటను పాడారనే ప్రచారం జరుగుతోంది.

పవన్ సరసన అందాలభామలు కీర్తి సురేశ్‌, అను ఇమ్మాన్యూల్ న‌టిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 2018 జనవరి 10వ తేదీన విడుద‌ల చేసేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -