Friday, May 3, 2024
- Advertisement -

ర‌స‌కందాయంలో అనంత‌పురం టీడీపీ రాజ‌కీయాలు

- Advertisement -

అనంతపురం రాజకీయం రసకందాయంలో పడింది. వైసిపి నేత గుర్నాధరెడ్డిని పార్టీలోకి చేర్చుకోవాలన్న చంద్రబాబునాయుడు నిర్ణయ‌మే ఇప్పుడు పార్టీలో నిప్పురాజేసింది. ఆయ‌న రాక‌ను సిట్టింగ్ ఎమ్మెల్యే ప్ర‌భాక‌ర్ చౌద‌రి పూర్తిగా వ్య‌తిరేకిస్తున్నారు. తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు టీడీపీలో అల‌జ‌డిని రేపాయి.

అనంతపురం మాజీ ఎంఎల్ఏ, వైసిపి నేత గుర్నాధరెడ్డి టిడిపిలో చేరుతున్న సమయంలో సిట్టింగ్ ఎంఎల్ఏ ప్రభాకర చౌదరి పెద్ద బాంబే పేల్చినట్లైంది. గుర్నాధరెడ్డి సోదరులను చంద్రబాబు టిడిపిలోకి చేర్చుకుంటున్నారు. దీంతో 2019 ఎన్నిక‌ల్లో ప్ర‌భాక‌ర్‌కు ఎక్క‌డ టికెట్ట ద‌క్క‌ద‌నే విష‌య‌మై అందోళ‌న‌లో ఉన్నారు.అయితే చౌదరి ఆందోళనను లెక్క చేయకుండా చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.

ఇటువంటి సమయంలో అసెంబ్లీ లాబీల్లో ఈరోజు ప్రభాకర్ మాట్లాడుతూ, గుర్నాధరెడ్డి చరిత్రంతా హత్యలు, కబ్జాలేనంటూ విరుచుకుపడ్డారు. అక్రమ సంపాదనను సక్రమం చేసుకునేందుకే టిడిపిలోకి వస్తున్నట్లు మండిపడ్డారు. వైసిపి నేత అక్రమాలపై ఇంతకాలం పోరాటాలు చేసిన తాము ఇక ఎవరిపై పోరాటాలు చేయాలంటూ పాపం చౌదరి బాధడిపోయారు. అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి తప్ప వైసిపి నేత టిడిపిలో చేరటాన్ని ఎవరూ స్వాగతించటం లేదని కూడా చెప్పేసారు.

వీరిద్దరి మధ్య సయోధ్య కుదర్చడం చంద్రబాబుకు కష్టమేనని చెప్పాలి. గుర్నాథ్ టీడీపీలో చేరడాన్ని ముందునుంచి కూడా ప్రభాకర్ వ్యతిరేకిస్తున్నారు. గురునాథ్‌రెడ్డి, ప్ర‌భాక‌ర్ చౌద‌రి మ‌ధ్య రాజ‌కీయ వైరం ఉంది. ఒక వేల ఇద్దిరి మ‌ధ్య స‌యోధ్య కుద‌ర‌క‌పోతె ప్ర‌భాక‌ర్ చౌద‌రి త‌న దారి తాను చూసుకోవ‌డం ఖాయం అన్న వార్త‌లు వినిపిస్తున్నాయి.

https://www.youtube.com/watch?v=w4m3eYplqfw

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -