Friday, May 10, 2024
- Advertisement -

ప‌వ‌న్ అభిమానుల‌కు పండ‌గే

- Advertisement -
  • అజ్ఞాత‌వాసి ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప‌వ‌న్ అభిమానుల‌కు ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌తో పండుగ చేసుకుంటున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు బీభ‌త్స‌మైన అభిమానులు ఉన్నారు. ఆ అభిమానం ఒక్కోసారి పీక్ స్టేజ్‌కు వెళ్లి పిచ్చిపిచ్చి ప‌నులు కూడా చేస్తుంటారు. అవ‌న్నీ ప‌క్క‌న పెడితే ప‌వ‌న్‌క‌ల్యాణ్ న‌టిస్తున్న 25వ సినిమా కావ‌డంతో అభిమానులు ఆతృతంగా ఎదురుచూస్తున్నారు. ప‌వ‌న్ కూడా ఈ సినిమాను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాడు. త‌న స్నేహితుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ న‌టిస్తున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేశ్‌, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. మ‌మ‌త స‌మ‌ర్ప‌ణ‌లో హారిక‌, హాసిని క్రియేష‌న్స్ నిర్మాణంలో సినిమా వ‌స్తోంది. ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్ ఎట్ట‌కేల‌కు విడుద‌ల‌య్యింది.

ఈ ఫ‌స్ట్‌లుక్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఐడీ కార్డ్‌ను తిప్పుతూ.. ఒక కాలు సోఫాపై పెట్టి.. ఒక కాలు కింద‌పెట్టి ఓర చూపు చూస్తున్నాడు. సినిమా పేరు అజ్ఞాత‌వాసి అని పేరు అధికారికంగా ఖ‌రారు చేశారు. దాని కింద‌ ప్రిన్స్ ఇన్ ఎక్సైల్ ట్యాగ్‌లైన్ ఉంది. అంటే ప్ర‌వాస రాజు అనే అర్థంలో ఉంది. ఇక ఈ సినిమాను సంక్రాంతి పండుగకు తీసుకురావాల‌ని చిత్ర బృందం ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఈ సినిమాకు సంగీతం అనిరుధ్ అందిస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా పాట‌లు రెండు విడుద‌లై ఆక‌ట్టుకుంటున్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -