Saturday, May 4, 2024
- Advertisement -

మ‌రిది సినిమాలో వ‌దిన‌మ్మ

- Advertisement -
  • హ‌లో సినిమాలో స‌మంత, అమ‌ల‌, నాగార్జున కూడా

అక్కినేని మూడో త‌రంలో చిన్నోడు అఖిల్ న‌టిస్తున్న సినిమా హ‌లో. ఇటీవ‌ల విడుద‌లైన హ‌లో ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ఫ‌స్ట్‌లుక్‌తో కూడా ఆక‌ట్టుకున్న అఖిల్ ఈ సినిమాతో ఎలాగైనా విజ‌యం సాధించాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. అందుకే ఈ సినిమాకు తెగ క‌ష్ట‌ప‌డుతున్నాడు. తొలి సినిమా అఖిల్ ప‌రాజ‌యంతో దిగాలుగా ఉన్న అఖిల్ త‌న త‌ర్వాతి సినిమాకు తొలి నుంచి ప‌క్కా ప్లాన్ వేసుకొని ముందుకు వెళ్తున్నాడు. అందుక‌ని సినిమా విజ‌యం సాధించ‌డానికి ఏమేమి చేయాల‌ని ఆలోచ‌న‌లు చేస్తున్నాడు. ఆ సినిమా బృందం కూడా సినిమా విజ‌యం కోసం తెగ తాప‌త్ర‌యం ప‌డుతోంది.

అందులో భాగంగా అక్కినేని కుటుంబ స‌భ్య‌లంద‌రినీ న‌టించేలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. పెళ్లి త‌ర్వాత మ‌రిదితో వ‌దిన‌మ్మ స‌మంత న‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. స‌మంతతో పాటు అక్కినేని నాగార్జున‌, అమ‌ల దంప‌తులు కూడా న‌టిస్తార‌ని టాక్‌. మ‌నం త‌ర్వాత మ‌ళ్లీ అక్కినేని కుటుంబ‌మంతా క‌లుసుకునే రెండో సినిమా ఇది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ సినిమాను విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వం చేస్తున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌పై తండ్రి అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తన తల్లిదండ్రులుగా నటిస్తున్న జగపతిబాబు, రమ్యకృష్ణల ఫొటోను అఖిల్‌లో ట్విటర్‌లో పంచుకున్నాడు. ఇటీవల అజయ్‌ పాత్రకు సంబంధించిన ఓ ఫొటోను పోస్ట్‌ చేశాడు. అఖిల్ స‌ర‌స‌న కల్యాణి హీరోయిన్‌గా చేస్తోంది. అన్ని కుదిరితే డిసెంబర్ 22వ తేదీన క్రిస్మ‌స్ ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ‘హలో’ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -