Monday, May 20, 2024
- Advertisement -

జంపింగ్స్…… జగన్, వైఎస్‌ టైంలో ఎల్లో రాతలు ఎలా ఉండేవి? ఇప్పుడు రివర్స్‌లో ఎందుకున్నాయి?

- Advertisement -

రెండు ప్రధాన మీడియా సంస్థలు. నీతులు చెప్పడంలో ఆరితేరిపోయారు. కానీ ఆచరణలో మాత్రం మచ్చుకు కూడా ఆ నీతులు కనిపించవు. అధికారికంగా, అనధికారికంగా దోచుకున్న ప్రజల సొమ్మూ అంతా ఇంతా కాదు. అంతా కూడా రాజవైభోగం. వాళ్ళు చేస్తున్న ఇతర వ్యాపారాల్లో ఉన్న లోపాలను వెతికితే మీడియాపై దాడి అని అరిచి అరిచి గోల చేస్తారు. మేధావి అని చెప్పుకునే జయప్రకాష్ నారాయణతో సహా వాళ్ళ వర్గం బ్యాచ్ అందరూ అది మీడియాపై దాడే….. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు అని మాటల దాడులకు దిగుతారు. ప్రజాస్వామ్యం గురించి పేజీలకు పేజీలు రాసేవాళ్ళు, పత్రికా స్వేచ్ఛ గురించి నీతులు చెప్పేవాళ్ళు కాస్తా వాళ్ళపై ఎవరైనా విమర్శలు చేస్తే మాత్రం అస్సలు సహించలేరు. భరించలేరు. ఇక స్వచ్ఛమైన, నిబద్ధతతో కూడిన జర్నలిజం నడుపుతున్నాం అని చెప్పుకునే ఆయా మీడియా సంస్థల రాతలు అందుకు పూర్తి రివర్స్‌లో ఉంటాయి.

వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పిరాయింపులు చోటుచేసుకున్నాయి. కానీ అప్పట్లో కొన్ని విలువలు మాత్రం పాటించాడు వైఎస్సార్. తన ప్రియ శిష్యుడు అయిన దానం నాగేందర్ సీటు రాలేదన్న కోపంతో టిడిపిలో చేరి ఎన్నికల్లో గెలిచాడు. కానీ వైఎస్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ వెంటనే అధికార పార్టీలోకి రావాలనుకున్నాడు నాగేందర్. అయితే వైస్సార్ మాత్రం టిడిపికి, ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రమ్మన్నాడు. ఆ తర్వాత కాంగ్రెస్ తరపున పోటీ చేయించాడు. అయితే ఎల్లో మీడియా మొత్తం కూడా దానం నాగేందర్‌ని విలువల్లేని వ్యక్తిగా చిత్రీకరించాయి. వైఎస్ రాజకీయాన్ని కూడా తీవ్రస్థాయిలో విమర్శించాయి. ఆ విమర్శల ప్రభావం పనిచేసింది. దానం నాగేందర్ ఓడిపోయాడు. ఆ తర్వాత కాలంలో తన సొంత పార్టీ స్థాపించిన జగన్ కూడా తనతో పాటు, తన తల్లి చేత కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చిన పదవులకు రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళిపోయాడు. అలాగే కాంగ్రెస్, టిడిపిల నుంచి రావాలనుకున్న ఎమ్మెల్యేలు, ఎంపిల అందరిచేతా రాజీనామా చేయించాడు. ఎన్నికలను ఎదుర్కున్నాడు. ఇంకా కొంతమంది జగన్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేల రాజీనామాలను అప్పటి స్పీకరే ఆమోదించలేదు. ప్రభుత్వం పడిపోతుందన్న భయం అప్పటి సిఎం కిరణ్ కుమార్‌రెడ్డిది. అయితే ఆ మొత్తం రాజకీయ పరిణామాలన్నింటినీ జగన్‌కి వ్యతిరేకంగానే రాసింది ఎల్లో మీడియా. చంద్రబాబు, కిరణ్ కుమార్‌రెడ్డిలు కూడా ఎల్లో మీడియా రాతలనే అందిపుచ్చుకున్నారు. జగన్ ఎమ్మెల్యేలను, ఎంపిలను కొంటున్నాడని, అవినీతి సొమ్ముతోనే ఈ వ్యవహారాలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు.

సీన్ కట్ చేస్తే ఇప్పుడు టిడిపిలోకి జగన్ పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయిస్తున్నారు. కానీ ఎల్లో మీడియాలో ఎక్కడా కూడా కొనుగోలు అన్న పదమే కనిపించడం లేదు. ఇలాంటి ఫిరాయింపులు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అన్న వార్తలు కూడా కనిపించడం లేదు. మీడియా ద్వారా ప్రజాసేవ చేశాడు అని చెప్పి కేంద్రప్రభుత్వ అత్యున్నత అవార్డు అందుకున్న రాజగురువుకు కూడా ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న నీచమైన ఫిరాయింపులు తప్పుగా కనిపించడం లేదు. స్వర్గీయ ఎన్టీఆర్‌లాగే జగన్ కూడా పార్లీలోకి రావాలనుకున్న ఏ నేత అయినా అంతకుముందు ఉన్న పార్టీ ద్వారా వచ్చిన పదవులకు రాజీనామా చేశాకే పార్టీలో చేరాలని షరతులు పెట్టాడు. నంద్యాల ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ పదవి చేపట్టి నెలలు కూడా కానప్పటికీ శిల్పా చక్రపాణిరెడ్డి చేత రాజీనామా చేయించాడు జగన్. మరి చంద్రబాబులో ఆ నిజాయితీ ఎక్కడ? నాడు ఎమ్మెల్యేల చేత, ఎంపిల చేత రాజీనామా చేయించి మరీ జగన్ తన పార్టీలో చేర్చుకున్నాడు. అయినప్పటికీ చంద్రబాబుతో సహా టిడిపి నేతలు, ఆ పార్టీ భజన మీడియా అంతా కూడా అవినీతి సొమ్ముతో జగన్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నాడని, పదవీకాంక్షతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడని రాశారు. అధికారంలో లేనప్పుడు జగన్ పార్టీలోకి చేరికలపై బాబు అండ్ కో చేసిన విమర్శలు అవి.

2014లో చంద్రబాబు అధికారంలో వచ్చారు. గత కొంత కాలంగా ఎమ్మెల్యేల కొనుగోళ్ళు, అమ్మకాల వ్యవహారాలు మామూలుగా జరగడం లేదు. స్పీకర్ వ్యవస్థ కూడా చంద్రబాబు రాజకీయంలో భాగం అయ్యింది అన్న మాట కంటికి కనిపిస్తున్న నిజం. మరి వైఎస్, జగన్‌ల టైంలో ఎన్నో నీతులు చెప్పిన ఎల్లో మీడియా ఏం చేస్తున్నట్టు? రాజగురువు గుర్రుపెట్టి నిద్దరోతున్నాడా? నిబద్ధతతో కూడిన ప్రయాణం అని తాజాగా కూడా చెప్పుకున్న బూతు మీడియా అని పేరుపడ్డ మీడియా యజమాని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు కూడా చాలానే చేస్తున్నారు. గిడ్డి ఈశ్వరి అనే ఎమ్మెల్యే టిడిపిలోకి ఫిరాయిస్తున్న సందర్భంగా ఈ రోజు ఎల్లో మీడియాలో వచ్చిన వార్తలను చూడండి. గత కొంతకాలంగా రాస్తున్న వార్తలు కూడా పరిశీలించండి. ఎక్కడా కూడా చంద్రబాబు ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నాడు అని వైకాపా నేతలు చేస్తున్న విమర్శలు కూడా కనిపించవు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా టిడిపిలోకి ఫిరాయించడం ఎంత పెద్ద తప్పో చెప్పే ప్రయత్నం అస్సలు ఉండదు. అలాంటి ఫిరాయింపులతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న నిప్పు నారాబాబును పల్లెత్తు మాట అనడం ఉండదు. కానీ జగన్‌కి షాక్, త్వరలోనే జగన్ పార్టీ నుంచి మరో పదిమంది ఎమ్మెల్యేలు జంప్, జగన్ ముఖారవిందం నచ్చకే ఎమ్మెల్యేలు జంప్ చేస్తున్నారు, ఫిరాయింపుదారులను పార్టీ మారకుండా చేయడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నా జంపింగ్స్‌ని ఆపకలేకపోతున్న జగన్, జగన్ పార్టీలో ఉన్న నాయకులకు కూడా జగన్‌పైన నమ్మకం పోతోంది, 2019 ఎన్నికల నాటికి అసలు జగన్ పార్టీ ఉంటుందా అన్న అనుమానంతో పార్టీ క్యాడర్ కూడా నిరుత్సాహపడుతోంది అని రాస్తున్నారు.

దశాబ్ధాలుగా తెలుగు ప్రజలకు నైతిక విలువలు నేర్చించడానికే ఉన్నామని డప్పుకొట్టుకునే ఎల్లో మీడియా బట్టలు విప్పితే కనిపించే నిజం ఇదే. ఇక్కడ సాక్షి పత్రిక గురించి కూడా చెప్పుకోవాలి. రాజకీయ వ్యవహారాల్లో మాత్రం జగన్ ఎప్పుడూ కూడా చంద్రబాబులా దొడ్డిదారి ప్రయత్నాలు, వెన్నుపోటు మార్గాలు ఎన్నుకోలేదు. ఎవరి చేతో సాక్షి మీడియాను పెట్టించి ఎల్లో మీడియా విషయంలో చంద్రబాబు చేస్తున్నట్టుగా జగన్ కూడా చెయ్యొచ్చు. కానీ జగన్ మాత్రం తప పేరు మీదే మీడియా సంస్థను స్థాపించి చాలా స్పష్టంగా సాక్షి మీడియా ఏంటి అనేది చెప్పేశాడు. కానీ చంద్రబాబు భజన మీడియా సంస్థలు, చంద్రబాబుది మాత్రం అంతా కపట వ్యవహారమే. జనాల కోసమే ఉన్నాం అని మాటలు చెప్పి నమ్మిస్తూ ఉంటారు. కానీ చేతలు అన్నీ మాత్రం అధికారం, లావాదేవీల చుట్టూనే ఉంటాయి. మిగతా విషయాలను ఇంకో సందర్భంలో చర్చిద్దాం. ఫిరాయింపుల విషయంలో మాత్రం యువకుడు అయిన జగన్‌కి, ప్రపంచానికే పాఠాలు చెప్పానని చెప్పుకునే చంద్రబాబుకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది అన్న మాట నిజం. కాదంటారా? టిడిపి జనాలు అయినా బూతులతో కాకుండా సహేతుకంగా విశ్లేషిస్తూ కాదనగలరా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -