పవన్ అభిమానులు ఎంతగానో ఎదురు చేస్తున్న అజ్ణాత వాసి ఆడియో రిలీజ్ ఫంక్సన్ డేట్ ఫిక్స్ అయ్యింది. అయితే ఫంక్సన్ ఎక్కడ నిర్వహిస్తారనే దానిపై పలు ఊహాగానాలు వచ్చిన సంగతి తెలిసిందే. మొదట విశాఖ గాని విజయవాడలో గాని ఉంటుందనే వార్తలు వచ్చాయి. అయితే అనుకోకుండా వేదిక మారింది.
పవన్ కల్యాణ్ 25వ సినిమాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అజ్ఞాతవాసి’ సినిమా తెరకెక్కింది. అనిరుధ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకూ వదిలిన సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో రిలీజ్ ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నారు. ఈ నెల 19వ తేదీన ఆడియో ఫంక్షన్ జరపనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు.
ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ న్యూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పవన్ కల్యాణ్ గిటార్ ప్లే చేస్తున్నట్టుగా వున్న ఈ స్టిల్ ఆయన అభిమానులను ఆకట్టుకునేలా వుంది. ఈ ఆడియో ఫంక్షన్ కి హైదరాబాద్ – హైటెక్స్ వేదికగా మారబోతున్నట్టు సమాచారం.
ఇక ఈ ఫంక్షన్ కి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరు కానుండటం అందరిలో ఆసక్తిని పెంచుతోంది. మెగా బ్రదర్స్ ను ఒకే వేదికపై చూసే క్షణాల కోసం అభిమానులు ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. జనవరి 10వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. అభిమానులకు పండగే.