Sunday, May 4, 2025
- Advertisement -

కొడుకా కోటేశ్వ‌ర‌రావు ప‌వ‌న్ పాట‌ టీజ‌ర్ వ‌చ్చేసింది…

- Advertisement -

అజ్ఞాతవాసి’ సినిమాలో పవన్ కళ్యాణ్ పాడిన ‘కొడకా కోటేశ్వర్ రావు’ పాట కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవర్ స్టార్ ఓ పాట పాడారు. కొడకా కోటేశ్వర రావు అని సాగే పాటకు పవన్ గొంతిచ్చారు. కొత్త సంవత్సరం కానుకగా పవన్ పాడిన పాటను సినీ యూనిట్ విడుదల చేయనుంది.

ముందుగా ఈ పాట టీజర్‌ను విడుదల చేశారు. పార్టీ పాటగా చెప్పుకునే ఈ పాట కొత్త సంవత్సరం ముందు రోజు డిసెంబర్ 31వ తేదీ ఆరు గంటలకు ఈ పాటను సోషల్ మీడియాలో విడుదల చేయనున్నట్లు ఈ టీజర్ ద్వారా తెలిపారు. దర్శకుడు త్రివిక్రమ్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ దగ్గరుండి ఈ పాటను రికార్డ్ చేయించారు.

డిసెంబర్ 31న సాయంత్రం ఈ సాంగ్ విడుదల చేస్తున్నారు. ఆ సాయంత్రం అందరూ న్యూఇయర్‌కు వేడుక సంబరాల్లో ఉంటారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కొడకా కోటేశ్వరరావు సాంగ్ మార్మోగి పోవడం ఖాయం

పవన్ అజ్ఞాతవాసి చిత్రానికి అనిరుధ్ సంగీతం సమకూర్చుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అజ్ఞాతవాసి ఆడియో రిలీజైంది. ప్ర అత్తారింటికి దారేది చిత్రంలో కాటమరాయుడా అంటూ సాగే పాటను పవన్ పాడిన సంగతి తెలిసిందే. ఈ పాట బంపర్ హిట్ అయ్యింది. ఇదే తరహాలో కొడకా కోటేశ్వర రావు పాట కూడా సూపర్ హిట్ సాంగ్ అవుతుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -