Monday, May 13, 2024
- Advertisement -

‘కొడకా కోటేశ్వరరావా…….. కుమ్మేసిన పవన్…… యూట్యూబ్ షేక్

- Advertisement -

అజ్ఙాతవాసికి సంబంధించి ఇప్పటి వరకూ బయటకు వచ్చిన అవుట్ పుట్ ఏదీ కూడా పవన్ ఫ్యాన్స్‌కి ఫుల్ జోష్ ఇవ్వలేదు. గబ్బర్‌సింగ్, అత్తారింటికి దారేది లాంటి మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందన్న హోప్ పూర్తిగా ఇవ్వలేదు. త్రివిక్రమ్, అనిరుథ్‌లు ఆ స్థాయి అవుట్ పుట్ ఇవ్వలేకపోయారు. అయితేనేం పవన్ ఆ బాధ్యతను తీసుకున్నాడు. సింగర్‌గా ఇప్పటి వరకూ పవన్ ఫెయిల్ అయిందే లేదు. ఈ సారి కూడా అంతే. కాటమరాయుడా….సాంగ్‌ని మ్యాచ్ చేయగలడా అని చాలా మంది అనుమాన పడ్డారు. కానీ ఆ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా పాట పాడేశాడు పవన్.

పవన్ ఎనర్జీ లెవెల్స్, ఎంటర్టైన్‌మెంట్ కంటెంట్ అంతా కూడా పవన్ ఫ్యాన్స్‌ని పిచ్చెక్కిస్తోంది. ఇక విజువల్స్‌లో కనిపించిన పవన్ డ్యాన్స్ మూమెంట్స్, ఫన్నీ మూమెంట్స్ అన్నీ కూడా హిలేరియస్‌గా ఉన్నాయి. పవన్ వాయిస్ మరోసారి మేజిక్ చేసి పడేసింది. పవన్ వాయిస్‌లో ఉన్న స్పెషాలిటీ మరోసారి మయ చేసేసింది. అందుకే కొడకా……సాంగ్ దెబ్బకు యూట్యూబ్ షేక్ అవుతుంది. రొటీన్ లైఫ్‌కి అలవాటుపడిపోయి బోరింగ్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళ గురించి పవన్ ఈ పాట పాడాడని తెలుస్తోంది. లైఫ్‌లో కాస్తంత లైఫ్ కూడా ఉండాలని మెస్సేజ్ ఇవ్వబోతున్నాడు. అత్తారింటికి దారేది స్థాయిని మ్యాచ్ చేస్తుందా…….సినిమా బాగానే వచ్చిందా అని డౌట్స్ ఉన్నవాళ్ళందరికీ కూడా పవన్ సాంగ్ మాత్రం చాలా క్లారిటీనే ఇచ్చింది. ఈ కొడకా కోటేశ్వరరావా సాంగ్ మాత్రం బ్లాక్ బస్టర్. ఇక సింగర్‌గా పవన్ కూడా సూపర్ డూపర్ సక్సెస్ అయ్యాడు. సినిమా కూడా ఈ స్టాండర్డ్స్‌లో ఉంటే హిస్టరీ రిపీట్ అవ్వడం ఖాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -