Monday, April 29, 2024
- Advertisement -

2018 సంవ‌త్స‌ర క్రికెట్ ఇత‌ర క్రీడ‌ల‌ షెడ్యూల్ క్యాలెండ‌ర్‌….

- Advertisement -

2017 పాత సంవ‌త్స‌రంలో భార‌త్ అనేక విజ‌యాలు సాధించింది. పాత సంవ‌త్స‌రం టీమిండియా జ‌ట్టుకు మ‌ర‌చిపోలేని విజ‌యాల్ని అందించింది. సాత సంవ‌త్స‌రానికి వీడ్కోలు ప‌లికి కొత్త సంవ‌త్స‌రం 2018 వ‌చ్చేసింది. క్రికెట్ అభిమానుల‌కు కొత్త సంవ‌త్స‌రం అస‌లైన మ‌జాను పంచ‌నుంది

2018 సంవ‌త్స‌రంలో క్రికెట్‌తో పాటు ఇత‌ర క్రీడల అభిమానుల్ని అల‌రించ‌నున్నాయి. జనవరి 5 నుంచి భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఫుట్‌బాల్ ప్రపంచకప్ పోటీలకు రష్యా ఈ ఏడాదే తొలిసారి ఆతిథ్యం ఇవ్వనుంది. ఏషియన్ గేమ్స్, హాకీ వరల్డ్ కప్, కామన్వెల్త్ క్రీడలు అభిమానుల్ని అలరించనున్నాయి. క్రికెట్, బ్యాడ్మింటన్‌‌తోపాటు ఇతర క్రీడల క్యాలెండర్ మీకోసం..

క్రికెట్:

జనవరి 5 – ఫిబ్రవరి 24 వ‌ర‌కు భారత జట్టు దక్షిణాఫ్రికాలో సుదీర్ఘ ప‌ర్య‌ట‌న చేయ‌నుంది. ఇప్ప‌టికే ద‌క్ష‌ణాఫ్రికాకు భార‌త జ‌ట్టు చేర‌కుంది. స‌ఫారీల‌తో మూడు టెస్టులు, 6 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. సొంత గడ్డ మీద గతేడాది తిరుగులేని ప్రదర్శన చేసిన టీమిండియా ఇప్పుడు సఫారీ గడ్డ మీద సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. గత పాతికేళ్లుగా భారత జట్టు సౌతాఫ్రికాలో సిరీస్ గెలవలేదు. ఈ లోటును భర్తీ చేయాలని కోహ్లి సేన భావిస్తోంది.

జనవరి 13 – ఫిబ్రవరి 5 అండర్-19 వరల్డ్ కప్ న్యూజిలాండ్‌లో జ‌ర‌గ‌నుంది . పృథ్వీ షా నేతృత్వంలోని యువ భారత జట్టు కివీస్ గడ్డ మీద ప్రపంచకప్ ఆడనుంది.

మార్చి 8 – 20 వ‌ర‌కు శ్రీలంకలో భారత జట్టు ట్రై సిరీస్ ఆడనుంది. శ్రీలంక, భారత్, బంగ్లాదేశ్‌లు టీ20 సిరీస్‌లో తలపడనున్నాయి.

ఏప్రిల్ 4 – మే 31 వ‌ర‌కు. ఐపీఎల్ 2018. చెన్నై, రాజస్థాన్ జట్లు రెండేళ్ల విరామం తర్వాత ఐపీఎల్‌లో బరిలో దిగనున్నాయి. ఐపీఎల్ ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.

జూలై 3 – సెప్టెంబర్ 11 వ‌ర‌కు ఇంగ్లాండ్‌లో భారత జట్టు పర్యటన. కోహ్లి సేన ఇంగ్లిష్ గడ్డ మీద ఐదు టెస్టులు, 3 టీ20లు, 3 వన్డేల్లో తలపడనుంది.

సెప్టెంబర్ న ఇంగ్లాండ్ సిరీస్ ముగిసిన వెంటనే భారత జట్టు ఆసియా కప్‌లో ఆడనుంది. ఈ సిరీస్‌కు మన దేశమే ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. కానీ పాకిస్థాన్‌తో భారత్‌లో క్రికెట్ ఆడలేమని చెప్పడంతో టోర్నీ ఎక్కడ జరుగుతుందో ప్రస్తుతానికైతే సస్పెన్సే.

అక్టోబర్ – నవంబర్ మ‌ధ్య ఐసీసీ ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్స్ ప్రకారం వెస్టిండీస్ జట్టు మూడు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడేందుకు భారత్ రానుంది. ఈ సిరీస్‌పై ఇప్పటికీ స్పష్టత లేదు.

నవంబర్ 3 – నవంబర్ 24 మ‌ధ్య‌న మహిళల టీ20 వరల్డ్ కప్, వెస్టిండీస్. ఐసీసీ తొలిసారి మహిళల టీ20 వరల్డ్ కప్‌ను ప్రత్యేకంగా నిర్వహిస్తోంది.

డిసెంబర్ – ఫిబ్రవరి 2019 మ‌ధ్య టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన. షెడ్యూల్ పూర్తిగా కొలిక్కి రాలేదు. కానీ భారత జట్టు ఆస్ట్రేలియాలో 4 టెస్టులు, 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది.

బ్యాడ్మింటన్:

డిసెంబర్ 23, 2017 – జనవరి 14: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్
జనవరి 29: ఇండియన్ ఓపెన్ సూపర్ సిరీస్
మార్చి 14 – 18: ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్‌షిప్
జూలై 30 – ఆగష్టు 5: వరల్డ్ ఛాంపియన్ షిప్
నవంబర్ 20 – 25: వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్

ఫుట్‌బాల్: జూన్ 14 – జూలై 15: రష్యాలో ఫుట్‌బాల్ ప్రపంచ కప్ జరగనుంది.

ఏషియన్ గేమ్స్: ఆగష్టు 18 నుంచి సెప్టెంబర్ 2 తేదీల మధ్య జకర్తా, పాలెంబాంగ్‌లో ఏషియన్ గేమ్స్ జరగనున్నాయి.

కామన్వెల్త్ గేమ్స్: ఏప్రిల్ 4 – 15 తేదీల మధ్య గోల్డ్ కోస్ట్‌లో కామన్వెల్త్ క్రీడలు జరగనున్నాయి.

పురుషుల హాకీ వరల్డ్ కప్: నవంబర్ 28 నుంచి డిసెంబర్ 16 తేదీల మధ్య పురుషుల హాకీ వరల్డ్ కప్ భువనేశ్వర్‌లో జరగనుంది.

మహిళల హాకీ వరల్డ్ కప్: జూలై 21 నుంచి ఆగష్టు 5 తేదీల మధ్య లండన్లో మహిళల హాకీ వరల్డ్ కప్ నిర్వహించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -