Friday, May 10, 2024
- Advertisement -

పవన్ , దాసరిల సినిమా టైటిల్ అదేనా..?!

- Advertisement -

దర్శకరత్న దాసరి నారాయణ రావు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ల కాంబినేషన్ సినిమా దాదాపు ఖరారు అయినట్టే. మొదట్లో ఇది కచ్చితమైన ప్రతిపాదన అని పించకపోయినా.. ఇప్పుడు మాత్రం ఈ సినిమా గురించి వార్తలు మరింతగా ఊపందుకొంటున్నాయి. ఈ సినిమా తెరకెక్కడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ గురించి కూడా ప్రచారం మొదలవ్వడం విశేషం.

అనధికార వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా పేరు ‘కల్కి’. దీనికి “గోపాలా గోపాలా” దర్శకుడు కిషోర్ పార్ధసాని దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి. ఈ సినిమాకు తాను దర్శకత్వం వహించనని దాసరి ఎప్పుడో క్లారిటీ ఇచ్చాడు. ఒకదశలో పవన్ , దాసరిల సినిమాకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించబోయే అవకాశం ఉందని కూడా వార్తలొచ్చాయి.

అయితే ఇప్పుడు మాత్రం త్రివిక్రమ్ పేరు సైడైపోయింది. ‘గోపాలా గోపాలా’ సమయంలో ఆ దర్శకుడి పనితీరు నచ్చి పవన్ అతడికి అవకాశం ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే వీటిపై ఇంకా అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉంది. మొత్తానికి పవన్ , దాసరి కాంబినేషన్ లో సినిమా అంటే.. ఇది సంచలన సినిమా అవుతుంది.. ఇది పట్టాలెక్కడం మొదలైనప్పటి నుంచి మరింత క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది.. అని వేరే చెప్పనక్కర్లేదు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -