Wednesday, May 15, 2024
- Advertisement -

విదేశీ టూర్లకు మన్మోహన్ దే అంత ఖర్చు.. మరి మోడీ..?!

- Advertisement -

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విదేశీ పర్యటన గురించి చేసిన ఖర్చు గురించి ఒక ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. దేశానికి పదేళ్ల పాటు ప్రధానిగా ఉన్న మన్మోహన్ విదేశీ పర్యటనల నిమిత్తం దాదాపు 642 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి! 2004 నుంచి 2014 వరకూ ఆయన చేపట్టిన విదేశీ పర్యటనలకు ఈ ఖర్చు అయ్యిందని తెలుస్తోంది.

మరి మన్మోహన్ సింగ్ అంతగా విదేశీ పర్యటనలు పెట్టుకొనే రకం కాదని అందరికీ తెలిసిందే. ప్రత్యేకించి ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పోలిస్తే… మన్మోహన్ విదేశాల్లో పర్యటించింది చాలా చాలా తక్కువ. సగటున నెలకో విదేశీ పర్యటనకు వెళతున్నాడు నరేంద్రమోడీ. ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన ఈ తీరును కొనసాగిస్తున్నాడు!

ఏడాదిలోనే దాదాపు 20 దేశాలను చుట్టేసిన ఘన చరిత్రను సంపాదించుకొన్నాడు శ్రీమాన్ మోడీ. బహుశా మన్మోహన్ సింగ్ ఐదేళ్ల టర్మ్ లో చుట్టేసినన్ని దేశాలను మోడీ ఒకే ఏడాదిలో చుట్టేసి ఉండవచ్చు. ఇక భద్రతా ఏర్పాట్ల విషయంలో కూడా మోడీ ది మన్మోహన్ పై పై చేయే..! కాబట్టి మన్మోహన్ విదేశీ పర్యటనలకు పెట్టిన 642 కోట్ల రూపాయల ఖర్చూ మోడీకి ఒక మూలకు సరిపోయి ఉండదేమో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -