Wednesday, May 15, 2024
- Advertisement -

ఆయనకు పదవితో మహేశ్ బాబు జగన్ పార్టీకి సొంతం?!

- Advertisement -

మున్సిపాలిటీల కోటాలో జరిగే శాసనమండలి ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల పైవైకాపా ఒక క్లారిటీ ఇచ్చింది. ఈ జాబితాలో వైకాపా వాళ్లు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు పేరు ను ఉంచడం ఆసక్తికరమైన అంశమే. ఈయన ఎవరో వేరే పరిచయం చేయనక్కర్లేదు.

సూపర్ స్టార్ కృష్ణకు తమ్ముడు ఆదిశేషగిరిరావు. అంటే మహేశ్ బాబుకు బాబాయ్. ఆది నుంచి కాస్త కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడిగా.. ఒక దశలో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఎన్నికైన చరిత్ర ఉంది కృష్ణకు.

ఇక 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆదిశేషగిరిరావు వంటి వాళ్లు వైఎస్ తో సన్నిహితంగా కనిపిస్తున్నారు. తద్వారా కృష్ణ ఫ్యామిలీకి.. కాంగ్రెస్ కు బంధం కొనసాగింది.  అయితే 2014 ఎన్నికల సమయంలో మాత్రం.. కృష్ణఫ్యామిలీ తెలుగుదేశానికి అనుకూలంగా నిలబడింది. అందుకే కారణం  ఏమిటో కూడా తెలిసింది. అల్లుడు గల్లా జయదేవ్ వరకూ కృష్ణ ఫ్యామిలీతెలుగుదేశానికి మద్దతు పలికింది.

మహేశ్ బాబు కూడా తమ బావను గెలిపించమని అభిమానులను కోరాడు. ఇలాంటి నేపథ్యంలో మహేశ్ ను టీడీపీ ఓన్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు విశేషం ఏమిటంటే.. ఆదిశేషగిరి రావుకు గనుక వైకాపా పదవిని ఇచ్చి.. ఆయనను ఎమ్మెల్సీగా చేస్తే.. వైకాపా వాళ్లు  కృష్ణను, మహేశ్ బాబును ఓన్ చేసుకొంటారు. తమ పార్టీ ఫ్లెక్సీల్లో మహేశ్ బొమ్మను పెడతారు. ఈ విధంగా మహేశ్ ను ఒకేసారి రెండు రాజకీయ పార్టీల వాళ్లు తమ వాడు అంటారేమో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -