Sunday, May 5, 2024
- Advertisement -

అన్నపూర్ణ స్టూడియోస్‌కు చేరుకున్న పవన్‌?

- Advertisement -

గత కొద్ది రోజులు తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై సినీపెద్దలు అన్ని రంగాల వారితో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. గ‌త కొన్ని రోజులుగా టాలీవుడ్ తీవ్ర సంక్షోభంలో ఉంది.ఈ సమావేశానికి మా అధ్యక్షులు శివాజీ రాజా.. నిర్మాతలు సురేష్‌ బాబు, అల్లు అరవింద్‌, కేయస్‌ రామారావు, దానయ్య,ఘట‍్టమనేని ఆదిశేషగిరిరావు, అన్నపూర్ణ స్టూడియోకు చేరుకున్నారు. పవన్‌ కూడా సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతుండటంతో అభిమానులు కూడా అన్నపూర్ణ స్టూడియోస్‌కు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.

న‌టి శ్రీరెడ్డి గొడ‌వ‌తో మొద‌లు ఇది చాలా మ‌లుపులు తిరుగుతుంది.పవన్‌ కల్యాణ్‌పై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయటంతో కాస్టింగ్‌ కౌచ్‌ అంశం మరో మలుపు తిరిగింది. శ్రీరెడ్డి వ్యాఖ్యలను మెగా ఫ్యామిలీ సీరియస్‌గా తీసుకోవటం. వ్యాఖ్యల వెనుక తానున్నానంటూ దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ చెప్పటంతో పరిస్థితి మరింత వేడెక్కింది. తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ కూడాఈ స‌మావేశానికి పాల్గొననున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -