Thursday, April 25, 2024
- Advertisement -

అదే స్టైల్.. అదే స్పీడ్.. బద్రిని తలపించిన ‘భీమ్లా’..!

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న అప్డేట్ ఇవాళ రానే వచ్చింది. పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేయడంతో పాటు ఈ మూవీ గ్లింప్స్ కూడా విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ గ్లింప్స్ పవన్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. వీడియోలో పవన్ కళ్యాణ్ కారు దిగుతూ ‘ ఒరేయ్ డెనీ.. బయటకు రా రా’ అంటూ ఆవేశంగా అరుస్తూ ఫైట్ చేసుకుంటూ వెళ్లడం ఆకట్టుకుంటోంది. పవన్ గళ్ళ లుంగీ,బ్లాక్ షర్ట్ ధరించి కొత్తగా కనిపించాడు.

మొత్తానికి ఈ గ్లింప్స్ పవన్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉన్నాయి. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులకు కనువిందులా ఉన్నాయి. తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయేలా ఉంది. ఒక వీడియో చివర్లో ‘ఏంటి చూస్తున్నావ్.. కింద క్యాప్షన్ లేదనా.. అక్కర్లేదు.. బండెక్కు.. అంటూ పవన్ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. 21 ఏళ్ల కిందట వచ్చిన బద్రి సినిమాలో కనిపించిన పవన్ స్టైల్, దూకుడు మళ్లీ భీమ్లా నాయక్ లో కనిపించింది.

అయ్యప్ప నుమ్ కోషియమ్ రీమేక్ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర పేరు భీమ్లా నాయక్ అని చిత్ర యూనిట్ ప్రకటించినప్పటికీ.. కచ్చితంగా సినిమాకు అదే టైటిల్ పెడతారని ఫ్యాన్స్ భావిస్తూ వచ్చారు. చివరికి మేకర్స్ కూడా అదే పేరును టైటిల్ గా కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల కానుంది. అలాగే ఈ మూవీ లోని పాటలు పవన్ బర్త్ డే సందర్భంగా సెప్టెంబర్ 2 నుంచి వరుసగా విడుదల కానున్నాయి. భీమ్లా నాయక్ సినిమాకు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. వకీల్ సాబ్ సూపర్ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -