ఈ సారైనా నవ్వులు ఖాయమా?.. మరోసారి రవితేజ, శ్రీను వైట్ల కాంబో..!

- Advertisement -

దర్శకుడిగా శ్రీనువైట్ల, హీరోగా రవితేజ కెరీర్ ఇంచుమించు ఒకేసారి మొదలైంది. రవి తేజ హీరో కాకముందు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత శ్రీను వైట్ల దర్శకుడిగా, రవితేజ సోలో హీరోగా పరిచయం అవుతూ వచ్చిన సినిమా నీకోసం. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత రవితేజ, శ్రీనువైట్ల వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. రవితేజ ఈ సినిమా తర్వాత ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్ సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. శ్రీను వైట్ల కూడా ఆనందం, రెడీ వంటి సినిమాలతో టాప్ డైరెక్టర్ గా ఎదిగాడు.

నీకోసం సినిమా తర్వాత రవితేజ -శ్రీనువైట్ల కాంబినేషన్లో దుబాయ్ శీను, వెంకీ, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలు వచ్చాయి. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా డిజాస్టర్ కావడంతో శ్రీనువైట్ల కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. రీ ఎంట్రీ లో శ్రీనువైట్ల మంచు విష్ణు హీరోగా ఢీ అంటే ఢీ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తర్వాత రవితేజ -శ్రీను వైట్ల కాంబినేషన్లో మరో సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే శ్రీను వైట్ల రవితేజ ను కలిసి కథ వినిపించారని అది ఆయనకు నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి అనే సినిమాలో నటిస్తున్నాడు. దీంతోపాటు కొత్త డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వంలో రామారావు అనే సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత రవితేజ- శ్రీను వైట్ల కాంబినేషన్లో మూవీ పట్టా లెక్కనున్నట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించి అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.

Also Read : చిరు బర్త్ డే : రెండు సినిమాల అప్డేట్లు పక్కా..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -