Saturday, April 20, 2024
- Advertisement -

ఏపీలో రేపటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం..! మార్గదర్శకాలు ఇవే..!

- Advertisement -

ఏపీలో సోమవారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలను ప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా కొన్ని నెలలుగా పాఠశాలలు మూతపడ్డ సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరోనా తీవ్రత కాస్త తగ్గడంతో తిరిగి పాఠశాలలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

అయితే కరోనా థర్డ్ వేవ్ లో పిల్లలపై ప్రభావం అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాలలను నిర్వహించాలని విద్యాశాఖకు ఆదేశాలు ఇచ్చింది.రాష్ట్రంలో 61 వేల ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలు ఉండగా వాటిలో 70 లక్షలకు పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ పాఠశాలలన్నీ ప్రత్యేక జాగ్రత్తల నడుమ సోమవారం తెరుచుకోనున్నాయి. ఈ మేరకు కరోనా వ్యాప్తి చెందకుండా పాఠశాలల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.

పాఠశాలకు వచ్చే ప్రతి విద్యార్థి తరపున తల్లిదండ్రులు అనుమతి పత్రం రాసి ఇవ్వాలి.
ప్రతి సెక్షన్ కు 20 మంది విద్యార్థులకు మించకుండా తరగతులు నిర్వహించాలి.
తరగతి గదుల కొరత ఉంటే 6,7 తరగతులు ఒకరోజు 8, 9, 10 తరగతులను మరుసటి రోజు నిర్వహించాలి.
తరగతి గదిలో పిల్లలను దూరం దూరంగా కూర్చోబెట్టడం తో పాటు వాళ్లు మాస్కు ధరించేలా, శానిటైజర్ వినియోగించేలా చూడాలి.
పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి.
గతంలో పాఠశాలలకు ఏవైతే టైమింగ్స్ ఉన్నాయో అవే టైమింగ్స్ లోనే నిర్వహించాలి.
స్కూల్ బస్ లో సగం మంది పిల్లలకే అనుమతి. రిక్షాలో పాఠశాలకు రాకూడదు. తల్లిదండ్రులు పిల్లలను వ్యక్తిగతంగా తీసుకు వచ్చి తిరిగి తీసుకెళ్లాలి.
ఇంట్లో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారితో కలసి ఉండే పిల్లలకు పాఠశాలలో నో ఎంట్రీ.
ఉదయం పూట అసెంబ్లీ సాయంత్రం పూట ఆటలు ఇక ఉండవు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -