Friday, April 19, 2024
- Advertisement -

క్రిష్ సినిమా చేయలంటే కండిషన్ పెట్టిన పవన్..

- Advertisement -

పవన్ కళ్యాణ్ దర్శకుడు క్రిష్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. పిరియాడికల్ సినిమా గా తెరకెక్కబోతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉండగా పవన్ ఇలాంటి సినిమాలు మొదటిసారి చేయడం విశేషం.అయితే కరోనా విరామం తర్వాత చాలామంది హీరోలు మళ్లీ షూటింగ్‌లకు వచ్చేశారు. కానీ మెగా హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ మాత్రం ఇంకా చిత్రీకరణల్లో పాల్గొనలేదు. షూటింగ్‌లకు అనుమతులివ్వాలని మూణ్నాలుగు నెలల ముందే రెండు తెలుగు రాష్ట్రాల అధినేతల్ని కలిసిన చిరు.. ఇప్పుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడన్నది అర్థం కావడం లేదు.  పవన్ కళ్యాణ్ కూడా ఇప్పట్లో షూటింగ్స్ ప్రారంభించేలా లేడు..

ప్రస్తుతం వకీల్ సాబ్ అనే సినిమా చేస్తున్నాడు.. రాజకీయాలకు కొంత గ్యాప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఒకేసారి మూడు సినిమాలను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. అందులో మొదటిగా వస్తున్నది దిల్ రాజు నిర్మాత గా రాబోతున్న వకీల్ సాబ్ అనే సినిమా. గతంలో ఓ మై ఫ్రెండ్ సినిమా తో దర్శకుడిగా పరిచయమైనా వేణు శ్రీరామ్ ఈ సినిమా కి దర్శకుడు..తెలుగు నేటివిటి కి తగ్గట్లు, పవన్ కళ్యాణ్ హీరోయిజానికి తగ్గ మార్పులు చేసి ఈ సినిమా ని ఇక్కడ చేస్తున్నారు.. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది.. ఇటీవలే సినిమా కు సంబంధించి ఓ పాట, మోషన్ పోస్టర్ రిలీజ్ కాగ, పవన్ ఫాన్స్ వాటిని ఎంతగా ఆదరించారో అందరికి తెలిసిందే.. ఇక పవన్ కళ్యాణ్ రెండో సినిమా ని  క్రిష్ దర్శకత్వంలో చేస్తున్నాడు..

అయితే ఈ సినిమా ఇంకా మొదలవకపోవడానికి కారణం క్రిష్ అని తెలుస్తుంది.  ప్రస్తుతం వకీల్ సాబ్ రావడానికి లేట్ అవుతుందని క్రిష్ వైష్ణవ తేజ్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. డిసెంబర్ లోగా ఈ సినిమా ని పూర్తి చేసిన పవన్ తో సినిమా చేయాలన్నది క్రిష్ ఆలోచన.. అయితే ఈ విషయాన్ని పవన్‌కు కూడా చెప్పేశాడట. ‘వకీల్ సాబ్’ సినిమాను నవంబరుకల్లా పూర్తి చేసి, డిసెంబరుకు రెడీగా ఉంటే.. షూటింగ్ పున:ప్రారంభిద్దామని.. ఈ మేరకు మిగతా నటీనటులు, టెక్నీషియన్ల డేట్లు కూడా సర్దుబాటు చేసుకుంటున్నామని పవన్‌కు క్రిష్ చెప్పేశాడట. నిర్మాత రత్నం ఆధ్వర్యంలో అందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. మరి క్రిష్ కోరుకున్నట్లు పవన్ డిసెంబరుకల్లా ఈ సినిమా కోసం రెడీగా ఉంటాడో లేదో చూడాలి.

బాలకృష్ణ సినిమా ని బోయపాటి శ్రీను ఇంత లైట్ తీసుకున్నాడా

నటి సీత ఇప్పుడు ఎలా ఉందో ఏం చేస్తుందో తెలుసా ?

నోయెల్ తో విడిపోయిన తర్వాత ఎస్తర్ ఏం చేస్తుందో తెలుసా ?

ఆ సినిమా ని మళ్ళీ రీస్టార్ట్ చేసిన రామ్..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -