Saturday, May 4, 2024
- Advertisement -

పవన్ కొడుకు పేరు.. మార్క్ శంకర్ పవనోవిచ్.. ఎందుకు ఇలా పెట్టారంటే..?

- Advertisement -

మెగా కుటుంబంలో కాదు.. మొత్తం సినిమా పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ వేరు. ఆయన సినిమాల ద్వారా కంటే.. వ్యక్తిగతంగానే ఎక్కువ మంది అభిమానులను సంపాధించుకున్నాడు. తన పిల్లలకు పేర్లు పెట్టడంలోనూ పవన్ తన ప్రత్యేకత చూపించాడనే చెప్పాలి.

ఇంకా చెప్పాలంటే అలాంటి పేరు ఇంకెవరు పెట్టే అవకాశం లేని విధంగా పెట్టారు. పవన్ కళ్యాణ్ – అన్నా లెజ్నెవా దంపతులకు అక్టోబర్ 11న కొడుకు పుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ చిన్నారికి మార్క్ శంకర్ పవనోవిచ్ అనే పేరు పెట్టాడు. ఈ పేరులో శంకర్ అనేది పవన్ తన సోదరుడు చిరంజీవి పట్ల తనకున్న ప్రేమను ప్రదర్శిస్తూ పెట్టింది కాగా.. పవనోవిచ్ అనేది రష్యన్ స్టయిల్ లో పవన్ కళ్యాణ్ పేరు. ఈ పేరులో ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. మార్క్ అనేది క్రిస్టియన్ పేరు కాగా.. శంకర్ అనేది హిందూ పేరు. ఈ ఒక్క పేరుతో పవన్ తాను ఏ ఒక్క మతానికో పరిమితం కాదని చెప్పడమే కాదు.. అన్నయ్యతో విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న పుకార్లకు చెక్ పెట్టేశాడు.

పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నెవా దంపతులకు ముందు ఓ కూతురు కూడా ఉంది. ఆమె పేరు పోలినా అంజనా పవనోవా.. తన తల్లి అంజనదేవి పేరునే కూతురికి కూడా పెట్టుకున్నాడు. పోలినా అనేది పవన్ భార్య లెజ్నెవా ఎంచుకున్న పేరు. పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ లకు ఒక్క మగపిల్లాడు. ఇక ఆడపిల్ల సంతనం ఉన్నారు. వాళ్ల పేర్లు అకిరా నందన్ – ఆద్య. మొత్తాని పవన్ తన కొడుకుకు వైవిధ్యమైన పేరు పెట్టి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -