Monday, April 29, 2024
- Advertisement -

ప్ర‌తిప‌క్షం ప్ర‌జ‌ల్లోకి వెల్లాలంటె చంద్ర‌బాబు అనుమ‌తి కావాలా….?

- Advertisement -

ఏపీలో ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత 6 వ‌తేదీనుంచి ఆరునెల‌ల‌పాటు పాద‌యాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందె. అప్ప‌టినుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అనేక అడ్డంకులు సృష్టిస్తూ వ‌స్తోంది అధికార టీడీపీ. జ‌గ‌న్ చేస్తున్ పాద‌యాత్ర‌ను ఏవిధంగా నైనా అడ్డుకోవాల‌ని భారీ కుట్ర‌కు తెల‌ర‌పారు సాక్షాత్తు సీఎం చంద్ర‌బాబు.

పాద‌యాత్ర తేదీని ప్ర‌క‌టించిన‌ప్ప‌టినుంచి బాబు అండ్ బ్యాచ్‌కు గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయి. అప్ప‌టినుంచి పాద‌యాత్ర జ‌ర‌గ‌కుండా కుట్ర‌లు కుతంత్రాలు ప‌న్నుతున్నార‌న్న సంగ‌తి రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికి తెలిసిందే. మంత్రుల‌తో జ‌రిగిన స‌మ‌న్వ‌య స‌మావేశంలో బాబు కుట్ర‌కు తెర‌లేపుతూ మంత్రుల‌కు డైరెక్స‌న్ చేశారు. ‘జగన్‌ పాదయాత్ర చేస్తున్నారు.. తుని లాంటి ఘటనలు జరగొచ్చు.. అప్రమత్తంగా వుండండి..’ అన్నది చంద్రబాబు హెచ్చరికల సారాంశం. పోలీసు యంత్రాంగానికి చెప్పాల్సిందిపోయి మంత్రుల‌కు చెప్ప‌డ‌మే ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

అస‌లు తుని ఘ‌ట‌న‌కు…జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర‌కు ఏమ‌న్న సంభంధం ఉందా…? మ‌ద్ర‌గ‌డ పాద‌యాత్ర వాల్ల కాపుసామాజిక వ‌ర్గానికె సంబంధించిన‌ది. కాని జ‌గ‌న్ పాద‌యాత్ర నాలుగు కోట్ల ప్ర‌జ‌ల‌కు సంబంధించిన‌ది. ముద్ర‌గ‌డ కాపు ఐక్య‌వేదిక పేరుతో స‌భ‌ను నిర్వ‌హించారు. దానికి కొద్ది దూరంలో ర‌త్నాచ‌ల్ ఎక్స్‌ప్రెస్ త‌గ‌ల‌బ‌డింది. అసాంఘీక శక్తులు’ విధ్వంసం సృష్టించాయి.

దానికి వైసీపీకి సంబంధం పెట్టారు చంద్ర‌బాబు. వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి నేతృత్వంలోనే ఈ విధ్వంసానికి ప్లాన్‌ జరిగిందన్నది టీడీపీ ఆరోప‌ణ‌లు చేసింది. ఇంతవరకు వైఎస్సార్సీపీపై ఆరోపణల్ని నిరూపించలేకపోయింది చంద్రబాబు సర్కార్‌. ఎలాగైతేనేం, తుని విధ్వంసం పేరుతో ముద్రగడ పద్మనాభం నోరు కొక్కేశారు. ఇప్పుడు ఇదే రీతిలో జ‌గ‌న్ పాద‌యాత్ర‌నుకూడా అడ్డు కొనేందుకు బాబు కుట్ర‌లు ప‌న్నుతున్నారు.

జగన్‌ పాదయాత్రకీ, తుని విధ్వంసానికీ చంద్రబాబు ముడిపెడుతున్నారంటే, తెరవెనుకాల ‘స్కెచ్‌’ ఎంత భయంకరంగా వుండబోతోందో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఏదో ఒక గలాటా సృష్టించి, జగన్‌ పాదయాత్రకు అడ్డు తగలాలన్నది చంద్రబాబు స్కెచ్‌. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, షర్మిల పాదయాత్రలు నిర్వహించారు.. చంద్రబాబు కూడా పాదయాత్ర చేశారు అప్పుడు జ‌ర‌గ‌ని విధ్వంసం ఇప్పుడు ఎలా జ‌రుగుతుంది. ఇవ‌న్నీ చూస్తుంటె పాదయాత్రకు పూనుకుంటున్న వైఎస్‌ జగన్‌, అధికార పార్టీ వ్యూహాల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వుండాల్సిందే లేకుంటె దానిపై తీవ్ర ప్ర‌భావం చూపుతుంది. దీన్ని బ‌ట్టి చూస్తె బోడిగుండుకు…మోకాలికి లింకు పెట్ట‌డం అంటె ఇదేనేమో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -