Tuesday, May 7, 2024
- Advertisement -

పవన్ పెద్ద మనసు..నిర్మాతకు అండగా!

- Advertisement -

రాజకీయాల సంగతి పక్కన పెడితే వెండితెరపై పవర్ స్టార్ పవన్‌కు ఉన్న క్రేజే వేరు. పార్టీలకు అతీతంగా ఆయన్ని అభిమానించేవారున్నారు.వెండితెరపై పవన్ కనిపిస్తే చాలు పూనకాలు రావడం ఖాయం. ఇక సినిమా ఇండస్ట్రీలోని వారిని ఆదుకోవడంలోనూ పవన్ స్టైలే డిఫరెంట్. ముఖ్యంగా తన సినిమాల నిర్మాతలకు లాస్ వస్తే వారు అడగకుండానే సాయం చేయడం పవన్ నైజం.పలు సందర్భాల్లో నిర్మాతలకు హెల్ప్ కూడా చేశారు.

తాజాగా నిర్మాత ఎఎం రత్నంకు సాయంగా నిలిచారు పవర్ స్టార్. పవన్‌తో బంగారం సినిమా తీసి బాగా నష్టపోయారు ఎంఎం రత్నం. తర్వాత సినిమాలకు దూరమయ్యారు. చాలాకాలం తర్వాత తిరిగి పవన్‌తోనే క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమాను నిర్మిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు పవన్‌. దీంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుండటం, రిలీజ్ డేట్ కూడా అనుకున్న సమయానికి ఉండేలా కనిపించడం లేదు.

ఇక తన నిర్మాతకు నష్టం జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకున్న పవన్‌…సాయం అందించేందుకు ముందుకొచ్చారట. కిరణ్ అబ్బవరం హీరోగా రత్నం తనయుడు జ్యోతికృష్ణ రూపొందించిన చిత్రం ‘రూల్స్ రంజన్’. అక్టోబరు 6న సినిమా రిలీజ్ కానుండగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొననున్నారట.అంటే ఈ మూవీ ప్రీ రిలీజ్‌కు అతిథిగా రావడం ద్వారా సినిమాకు హైప్ తీసుకొచ్చేందుకు తన వంతు సాయం చేయనున్నారట. ఇప్పుడి వార్త టీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారగా పవన్‌పై ఇండస్ట్రీ ప్రముఖులు ప్రశంసలు గుప్పిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -