ప్రస్తుత జీవన విధానంలో ప్రతి వ్యక్తి జీవితంలో స్మార్ట్‌ఫొన్ ఎంత ప్రముఖ్యత వహిస్తుందో తెలిసిందే.ఇక స్మార్ట్‌ఫోన్ ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే విషయం తెలిసిందే.అభిమానులు తమకు ఇష్టమైనా హీరోలను ఫేస్‌బుక్,ట్విట్టర్‌ల ద్వారా వారిని ఫాలో అవుతుంటారు.సోషల్ మీడియా వేధికగా ఫ్యాన్స్ తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అని గొడవలు పడుతుంటారు. ట్విట్టర్‌లో అయితే సినిమా సెలబ్రిటీలకు మిలియన్స్‌లో ఫాలోవర్స్ ఉంటుంటారు.కానీ ఇప్పుడు ఆ నంబర్స్ లో నిజం లేదని తేల్చేసింది
ఓ సర్వే.ప్రముఖ ఆంగ్ల పత్రిక చేసిన సర్వేలో సెలెబ్రిటీల ట్విట్టర్ ఫాలోవర్స్ లో చాలా మంది ఫేక్ అని వెల్లడించింది. ఆ లిస్టులో ముందుగా స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, ఉండడం షాకిస్తోంది. పవన్ కళ్యాణ్ కు ట్విట్టర్ లో రెండు మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. కానీ అందులో 46 శాతం మంది మాత్రమే నిజమైన ఫాలోవర్స్ అని తేల్చిచెప్పారు. అంటే దాదాపుగా 54శాతం ఫేక్ ఫాలోవర్స్ అన్నమాట. ఈ లిస్ట్‌లో చాలామంది ఉన్న మొదటి స్థానంలో పవన్ ఉండటంతో ఆయన ఫ్యాన్స్ తెగ భాదపడుతున్నారు.
