ఏపీలో భాజాపా-టీడీపీ బంధం పెటాకులయిన తర్వాత ఏపీ భాజాపాకు కొత్త సారథిగా కన్నా లక్ష్మీనారాయణ నియామకమయ్యారు. రాష్ట్ర భాజాపా ఇన్‌ఛార్జ్‌గా రామ్ మాధవ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక్కసారిగా రాజకీయాలు మారిపోయాయి. బాబుకు చెక్ పెట్టేందుకే కన్నాకు పార్టీ పగ్గాలు అప్పగించారన్న సంగతి తెలిసిందే.
గత కొంతకాలంగా ఇరుపార్టీల మధ్య మాటలయుద్ధం కొనసాగింది. తాజాగా భాజాపా కొత్త అధ్యక్షుడు కన్నా చంద్రబాబపై మాటల దాడిని ఎక్కుపెట్టారు. తాజాగా బాబు తీవ్రమైన ఆరోపనలు చేశారు. బాబు ప్రతీసారి ఢిల్లీకి ఎందుకు వెల్తున్నారో రహష్యాన్ని వెల్లడించారు.
రాష్ట్రప్రయోజనకాలకోసం ఢిల్లీకి 29 సార్లు వెల్లినా కేంద్రం పట్టించుకోలేదని బాబు అనేక సార్లు ఊదరగొట్టారు. పచ్చ బ్యాచ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అదంతా ఇప్పుడు అబద్ధమని తేలిపోయింది. బాబు ఢిల్లీ గుట్టును బట్టబయలు చేశారు కన్నాలక్ష్మీనారాయణ. ఇది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాఫిక్‌గా మారింది.
ఏపీ అభివృద్ధి గురించి మాట్లాడేందుకు బదులు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని అడిగేందుకే చంద్రబాబు ఢిల్లీకి ఎక్కువగా వెళ్లారని కన్నా వెల్లడించారు. జగన్ మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్టు చేస్తారు.. ఏపీలో అసెంబ్లీ సీట్లను ఎప్పుడు పెంచుతారు? అనే అంశాలపైనే చంద్రబాబు ఫోకస్ ఎక్కువగా పెట్టారని బాంబు పేల్చారు .
రాష్ట్రంపై చంద్రబాబు ఫోకస్ ఉన్నట్టయితే ఆయన అడిగింది ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వం కాదనలేదని ఇందుకు నిదర్శనం స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించిన రోజున..దానికి కేబినెట్ అంగీకారం కావాలంటే వెంటనే ఇచ్చారన్నారు. ‘ఒకపక్క జగన్మోహన్ రెడ్డి, మరోవైపు పవన్ కల్యాణ్ ని చూసి చంద్రబాబు భయపడ్డారని అందుకే ప్రత్యేకప్యాకేజీపై . యూ టర్న్ తీసుకున్నారు. ఇన్నాల్లు రాష్ట్ర అభివృద్ధికోసమే ఢిల్లీకి వెల్లానన్న బాబు మాటలు పచ్చి అబద్ధాలని తేలిపోయింది.
