Wednesday, May 8, 2024
- Advertisement -

ఖుషి 15 ఏళ్ళు పూర్తి చేసుకుంది!

- Advertisement -

పవన్ కళ్యాణ్ ఎది చేసిన ఓ అద్భుతమే. ప్రేమకథ కొత్తగా తొలి ప్రేమ సినిమాని తీసి అందరితో పవన్ అహా అనిపించుకున్నాడు. ఆ సినిమా అప్పట్లో ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. అలాగే మరో ప్రేమ కథతో ఏప్రిల్ 27,2001న సినీ పరిశ్రమలో ఈ అద్భుతమైన సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా పవన్ కేరీయర్ లోనే ఓ టాప్ రేంజ్ సినిమాగా నిలిచిపోయింది.

ఆ సినిమా ఏంటీ అని అనుకుంటున్నారా? అదేనండి ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే అంటూ అలరించిన సినిమా ఖుషి. ఈ రోజుతో ఈ సినిమా 15 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో పవన్ సరసన భూమిక హీరోయిన్ గా నటించగా ఎస్ జే సూర్య ఈ సినిమా దర్శకత్వం వహించాడు. అల్లరి చిల్లరి కాలేజ్ కూర్రాడిలా పవన్ సిద్దు అనే పాత్రలో నటించగా అమయకపు మధు పాత్రలో భూమిక నటించింది. అభిమానులో ఈ చిత్రాన్నికి మంచి క్రేజ్ రావాడంతో పవన్, భూమిక కి అభిమానులో మంచి క్రేజ్ ఏర్పడింది.

ఇక ఈ సినిమాకి మరో హైలేట్ అంటే సంగీతం మణిశర్మ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రాణం పోసింది. ప్రతి పాట ఓ అద్భుతం. బాక్ గ్రాండ్ మ్యూజిక్ మరో హైలేట్. పీసి శ్రీరాం అందించిన ఫోటోగ్రాఫి మరో అద్భుతం. ఇప్పటికి ఈ సినిమా వచ్చిందంటే టీవిలకు అత్తుకుపోవాల్సింది. దట్ ఇజ్ ఖుషి. ఇక పవన్ ప్రస్తుతం మళ్ళీ ఎస్ జే సూర్య దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అనుప్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -