Tuesday, May 14, 2024
- Advertisement -

ప్రతీ దానికీ పవన్ కళ్యాణ్ రావాలి అంటే ఎలా ?

- Advertisement -

భారతీయులకీ ముఖ్యంగా తెలుగు వారు ఎవరో వస్తారు ఎదో చేసేస్తారు అని అలా ఎదురు చూస్తూ కూర్చోవడం, తమిళ నాడు ప్రభుత్వం వారి రాష్ట్రం లో స్కూళ్ళల్లో తెలుగు సబ్జెక్ట్ ను తెలుగు మీడియంను రద్దు చేసింది.  

దీని ఫలితంగా ఆ రాష్ట్రంలో తమిళుల తరువాత అత్యధికులైనటువంటి పలు తెలుగు కుటుంబాలు తమ పిల్లల చదువుల విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోనున్నాయి. ఈ విషయం పవన్ కళ్యాణ్ వరకూ వెళ్ళింది అని ఆయన రంగం లోకి దిగి ధర్నా చేస్తాడు అని అప్పట్లో పుకార్లు షికారు చేసారు. అదిగో ఇక వాటిని పట్టుకుని పవన్ వస్తాడు ఈ విషయం లో తమ తరఫున గట్టిగా పోరాడతాడు అనేది మైండ్ లో పెట్టేసుకున్నారు వారు. 

అక్కడ ఆ రాష్ట్రం లో తెలుగు వారి తరఫున చాలానే సంఘాలు ఉన్నాయి కానీ చాలా సంఘాలు ముందుకు వచ్చి ప్రజలతరఫున పోరాటం చెయ్యకపోవడం విచారకరం. తెలుగు వారి ఆత్మగౌరవం అంటూ అన్నగారు అప్పట్లో ఇచ్చిన లెక్చర్ లు ఎవరికీ ఇంకా గుర్తు లేవు అనుకుంట అసలు ఆ ఛాయలకే వెళ్ళడం లేదు. తెలుగు వాళ్ళు తమ సొంత కాళ్ళ మీద నిలబడే శక్తి పోయిందేమోననే మాట ఎవరో వారి నుంచి వినబడక ముందే కాస్త జాగ్రత్త పడి కనీసం తమ వంతు పోరాటం మొదలుపెడితే తరువాత కలిసి వచ్చేదెవరో ? రానిదెవరో చూసుకోవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -