Tuesday, May 21, 2024
- Advertisement -

Watch: వర్మ కొత్త ‘అటాక్’ ట్రైలర్

- Advertisement -

ఫార్మ్ కోల్పోవడం కాదు కదా ఫార్మ్ అంటే ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితి లో ప్రస్తుతం ఉన్నాడు రాం గోపాల్ వర్మ, సెన్సేషన్ సృష్టించే దర్శకుడు గా ఎప్పుడూ వార్తల్లో ఉండే వర్మ చాలా కాలంగా ఆయన మార్క్ సినిమాలు తీయలేకపోతున్నాడు. కానీ అభిమానులు మాత్రం ఇంకా అలాంటి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. తనకి బాగా అలవాటు అయిన క్రైమ్ జోన్ లో సినిమా తీయడం ఇష్టపడే వర్మ ఇప్పుడు అటాక్ అంటూ రాబోతున్నాడు. 

మంచు మనోజ్ హీరోగా రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ట్రైలర్ కూడా అందరికీ నచ్చేసింది. ఈ సినిమా ఈ నెల లో విడుదల కావాల్సి ఉంది కానీ నవంబర్ లో విడుదల కి సిద్దం చేస్తున్నాడు వర్మ. 

ప్రకాష్ రాజ్, జగపతి బాబు తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా వర్మ మార్క్ గ్యాంగ్‌స్టర్ బేస్‌డ్ కథతో రూపొందిస్తున్నారు.

{youtube}4pg9nsUtUAA{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -