Wednesday, May 8, 2024
- Advertisement -

త్రివిక్రముడు ఎస్కేపయ్యాడు!

- Advertisement -

త్రివిక్రముడు రిస్క్ చేస్తున్నాడని గతకొంతకాలంగా పరిశ్రమ కోడై కూస్తోంది.తెలిసి తెలిసి నందమూరి హీరోలతో అతను ఎందుకు పెట్టుకుంటున్నాడా అంటూ అతన్ని చాలామంది కొశ్చన్ చేసారు.

అయినా మనోడు వెనక్కి తగ్గలేదు.నితిన్ పటేల్ తో సంక్రాంతి రేసులో తాడో పేడో తేల్చుకుని తన సత్తా చాటుతానన్నాడు. కట్ చేస్తే…ఇపుడు తన ఆలోచనను విరమించుకున్నాడు.

పొంగల్ రేసు నుంచి అఆ చిత్రాన్ని బయటకు తెచ్చేశాడు.నితిన్ అఆ సినిమాను ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తానని చెబుతున్నాడు.ఒక్కసారిగా ఎందుకింతలా జ్ణానోదయం అయ్యిందంటే మాత్రం ఎప్పటిలాగే ముసి ముసి నవ్వులు నవ్వుతున్నాడట. 

మరి తనికెళ్ల వారు ఏం చెప్పారో,సిరివెన్నెల గారు ఏం పాట పాడారో తెలియదుగాని పౌరుషానికి పోకుండా తెలివిగా పొంగల్ ఫైట్ నుంచి ఎస్కేపయ్యాడు.అయితే ఇక్కడ నందమూరి హీరోల విషయంలో త్రివిక్రముడు ఎస్కేపయ్యాడు సరే….మరి నితిన్ రెడ్డి ఫ్యాన్స్ నుంచి అతను ఎలా ఎస్కేప్ అవుతాడన్నది  చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -