Monday, May 6, 2024
- Advertisement -

పవన్ పేరు మార్పు వెనక అసలు కారణం ఇదేనా..?

- Advertisement -

ప్రముఖ హీరో.. పవన్ కళ్యాణ్ కళ్యాణ్ కి సినీ రాజకీయా రంగాల్లో ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే పవన్ కళ్యాణ్ పేరుకు టాలీవుడ్ లో చాలా క్రేజ్ ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన పేరుని మార్చుకొని షాక్ ఇచ్చారు. అవును పవన్ కళ్యాణ్ పేరు మార్చుకున్నారో లేదో కన్ఫాం గా తెలియదు కానీ.. ఇప్పుడు ఆయన పేరు మాత్రం కుశాల్ బాబు.

అసలు విషయంలోకి వేళ్తే.. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్సకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ కుశాల్ బాబు అనే పేరును త్రివిక్రమ్ సూచించినట్టు తెలుస్తోంది. సినిమా టైటిల్ తెలియదు కానీ సినిమాలో పవన్ పేరు మాత్రం కుశాల్ బాబు అని అంటున్నారు. మీరు కూడా ప్రస్తుతం గూగుల్ లో పవన్ కళ్యాణ్ అని సెర్చ్ చేస్తే గూగుల్ కుశాల్ బాబుగా సూచిస్తోంది. అయితే పవన్ వరకు ఈ విషయం వెళ్లిందో లేదో తెలియదు కానీ ఇప్పుడూ కుశాల్ బాబు పేరు మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ అవుతోంది. అసలు కుశాల్ బాబు అని గూగుల్ ఎందుకు సూచిస్తోంది అని ఫ్యాన్స్ థింక్ చేయడం మొదలు పెట్టారు. ఇక వేళా త్రివిక్రమ్ సినిమాలో పవన్ పాత్ర పేరు గూగుల్ కి ముందే తెలుసా.. అందుకే కూశాల్ బాబు అని చూపిస్తుందా అని ఆలోచిస్తున్నారు.

ఏది ఏమైన ఈ కుశాల్ బాబు పేరు పై ఓ క్లారిటీ వచ్చే వరకు ఈ పేరు సోషల్ మీడీయాలో హల్ చల్ చేస్తునే ఉంటుంది. ఇక త్రివిక్రమ్ పవన్ సినిమాలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తుండగా.. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. కె.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాని సంక్రాంతి బరిలో విడుదల చేయాడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -